బీజేపీ, టీఆర్‌ఎస్‌పై రేవంత్ రెడ్డి ఫైర్
ఢిల్లీ: బీజేపీ, టీఆర్‌ఎస్‌పై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మండిపడ్డారు. కిరాయి మనుషులతో బీజేపీ, టీఆర్‌ఎస్ హడావిడి చేస్తోందని ఎద్దేవాచేశారు. రాజకీయ పార్టీల భేటీలను ఔట్ సోర్సింగ్‌గా మార్చేశారని మండిపడ్డారు. ప్రజాసమస్యలు గాలికొదిలేసి బీజేపీ, టీఆర్ఎస్ చిల్లర రాజకీయాలు చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ, టీఆర్‌ఎస్ పార్టీలకు ప్రజలు బుద్ధి చెబుతారని హెచ్చరించారు. సీఎం కేసీఆర్ తెలంగాణను అప్పుల రాష్ట్రంగా మార్చేశారని ధ్వజమెత్తారు. రాష్ట్ర ప్రయోజనాలపై ప్రధాని మోదీని కేసీఆర్ ఎందుకు ప్రశ్నించలేదన్నారు.
కేంద్రం తప్పులను ఒప్పందం ప్రకారమే టీఆర్ఎస్ ఎత్తిచూపలేదని విమర్శించారు. టీఆర్ఎస్‌పై మోదీ కూడా ఎలాంటి విమర్శలు చేయలేదని రేవంత్ రెడ్డి దుయ్యబట్టారు.
