చికెన్లో మత్తు మందు కలిపి తల్లీ కూతిరిపై అత్యాచారం..

చికెన్లో మత్తు మందు కలిపి తల్లీ కూతిరిపైఅత్యాచారం..
హైదరాబాద్: మానవత్వాం మంటగల్సింది అనడానికి నిలువెత్తు నిదర్శనం చందానగర్ పోలీస్ స్టేషన్ పరిథిలో చోటుచేసుకున్న దారుణ ఘటన. పొట్టకుటి కోసం కడుపు చేతిలో పట్టుకోని నగరానికి వలస వచ్చిన ఒ కుటుంబానికి చేదు అనుభవం ఎదురైంది. మహబుబ్ నగర్ ప్రాంతం నుండి హైదరాబాద్ కు కూలి పని పనిచేసుకోడానికి వచ్చిన ఆ కుటుంబం చందానగర్ ప్రాంతంలో నివాసం ఉంటు కూలి పని చేస్తూ జీవనం కోనసాగిస్తున్నారు.

నమ్మినద్దుకు మోసాపోయారు.
ఇంటి యజమానే కాదా అని నమ్మినద్దుకు చావు బ్రతుకుల్లో ఆ కుటుంబం. మహిళలపై చెడు దృష్టితో చూసిన ఆ ఇంటి యజమాని పథకం ప్రకారం చికెన్లో మత్తు కలపి వారికి ఇచ్చాడు. మత్తు మంది కలిపిన చికెన్ తిని ఆ కుటుంబ సభ్యులు స్పృహ తప్పి పడిపోయారు.

కామంతో కోట్టుకుంటున్న ఇంటి యజమాని అతని స్నేహితులు కలిసి స్పృహ తప్పి పడిపోయిన మహిళలపై కూతిరిపై అత్యాచారానికి పాల్పడ్డారు. అఘాయిత్యానికి పాల్పడి వారు అక్కడి నుండి పారిపోయారు. విషయం తెల్సుకున్న స్థానికులు బాథితులను ఉస్మానియ ఆస్పత్రికి తరలించారు. వారి పరిస్థితి విషమంగా ఉందన్ని డాక్టర్లు తెలిపారు. అ చికెన్ తిన్న తన కుమరుడి పరిస్థతి కుడా విషమంగా ఉందన్ని తెలిపారు.

ఇంత దారుణానికి ఒడిగట్టిన కామాందులను కఠినంగా శిక్షించాలని స్థానికులు డిమాండ్ చేశారు. సంఘటన స్థలానికి చేరుకున్న చందానగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు మొదలు పెట్టారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *