ఖమ్మం జిల్లాలో వర్షం
ఖమ్మం: ఖమ్మం జిల్లాలో ఆదివారం రాత్రి నుంచి సోమవారం తెల్లవారుజాము వరకు ఓ మోస్తరు వర్షం పడగా.. జిల్లా వ్యాప్తంగా సగటున 1.2 సెంమీ వర్షపాతం నమోదైంది. కారేపల్లి (సింగరేణి)లో 3.4సెంమీ, ఏన్కూరులో 2.46 సెంమీ, కామేపల్లిలో 2.32సెంమీ, సత్తుపల్లిలో 2.12సెంమీ, తిరుమలాయపాలెంలో 1.66సెంమీ, బోనకల్లులో 1.62 సెంమీ, తల్లాడలో 1.58 సెంమీ, నేలకొండపల్లిలో 1.38 సెం.మీ వర్షపాతం నమోదైంది. కొద్దిరోజులుగా అడపాదడపా పడుతున్న వానలకు రైతులు వ్యవసాయపనులను ముమ్మరం చేశారు. ఇప్పటికే పలు ప్రాంతాల్లో రైతులు పత్తి విత్తనాలు వేస్తున్నారు.
