అధిష్టానం వద్ద రేవంత్‌కు పెరుగుతున్న బలం!
ఆర్.బి.ఎం హైదరాబాద్: టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి పార్టీపై పట్టు బిగిస్తున్నారు. రేవంత్‌రెడ్డిపై కాంగ్రెస్ సీనియర్ నాయకులు అసంతృప్తి వ్యక్తం చేస్తూ వస్తున్నారు. ఆయనపై అధిష్టానానికి ఫిర్యాదులు చేస్తున్నారు. రేవంత్‌రెడ్డిపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్న నేతలు ఢిల్లీ బాట పట్టారు. అయితే సోనియాగాంధీతో ఇతర నేతలు కూడా అపాయింట్‌మెంట్ ఇవ్వడానికి నిరాకరించారు. రేవంత్‌రెడ్డి.. అధిష్ఠానం వద్ద మరింత బలాన్ని సంపాదించుకున్నారని, అందువల్లే రాష్ట్ర నేతలకు అపాయింట్‌మెంట్ ఇవ్వలేదని చెబుతున్నారు. దీంతో అసమ్మతి నేతలు నిరాశతో తిరిగివచ్చారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో చేపడుతన్న కార్యక్రమాలపై రేవంత్‌రెడ్డి ఎప్పటికప్పుడు అధిష్టానం దృష్టికి తీసుకెళ్తున్నారు. పార్టీ సీనియర్ నేతలతో నిరంతరం మాట్లాడుతూ పార్టీలో బలమైన ముద్ర వేసుకున్నారని చెబుతున్నారు. అందువల్ల రేవంత్‌కు వ్యతిరేకంగా ఎలాంటి ప్రచారం చేసినా అధిష్టానం నమ్మే పరిస్థితి లేదని అంటుంన్నారు. రేవంత్‌కు వ్యతిరేకంగా ఎవరు లేఖలు రాసినప్పటికే ఎప్పటికప్పుడు ఆయనకు తెలిసిపోతున్నాయి. అందువల్ల రేవంత్‌పై ఎలాంటి ఫిర్యాదులు చేసినా ప్రయోజనం లేదని కొందరు చెబుతున్నారు. దీంతో ఏం చేయలేక అసమ్మతి నేతల చేతులు ఊపుకుంటు తిరుగు ప్రయాణమయ్యారు.
