బషీరాబాద్: అయ్యో పాపం.. ఓ నాగుపాము కాటుకు శునకం పిల్లలు బలయ్యాయి. జషీరాబాద్ మండలం మంతట్టి గ్రామంలో ఓ ఇంటి కాంపౌండ్ పక్కన ప్లాస్టిక్ కవర్ కింద ఓ శునకం తన పిల్లలతో ఉంటోంది. అక్కడి ఓ నాగుపాము వచ్చింది. పామును చూసి శునకం పిల్లలు భయపడి అరిచాయో ఏమో.. ఈ అరుపులను పాము సహంచలేక పోయింది. లోపలు ఉన్న శునకం పిల్లలను పాము బయటకు లాక్కొచ్చి మరీ చంపింది. ఈ సమయంలో అక్కడ ఉన్న తల్లి శునకం ఏమీ చేయలేక నిస్సాహయ స్థితిలో ఉండిపోయింది. తన పిల్లలను చంపుతున్న ఎదుర్కోలేక అలాగే నిలబడిపోయిన శునకం తీరు పలువురి హృదయాలను కలిచివేసింది. అందరూ చూస్తుండగానే మూడు కుక్క పిల్లలు పాముకాటుకు బలయ్యాయి. ఈ ఘటన స్థానికులను కలిచివేసింది. ఈ ఘటనకు సంబంధించిన ఫొటోలు, వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.