‘వకీల్ సాబ్’ హీరోయిన్ కు కరోనా పాజిటివ్..

‘వకీల్ సాబ్’ హీరోయిన్ కు కరోనా పాజిటివ్..

ఆర్.బి.ఎం డెస్క్ హైదరాబాద్: దేశంలో కరోనా సెకండ్ వేవ్ మొదలైపోయింది. దేశంలోకి కరోనా చొరబడి ఏడాది కాగా గతంతో పోల్చుకుంటే ఇప్పుడు కరోనా పాజిటివ్ ల సంఖ్య క్రమంగా పెరుగుతూ అధిక సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. ఈ కరోనా మహమ్మారి సినీ నటులపై కూడా పంజా విసిరింది. తాజగా బాలీవుడ్ నటి అలియా భట్ కూడా కరోనా మహమ్మారి బారినపడి హోం క్వారంటైన్‌లోకి వెళ్లిపోయారు ఇది అందరికి తెలిసిన విషయమే కాగా ‘వకీల్ సాబ్’ హీరోయిన్ నివేదా థామస్‌కు కరోనా లక్షణాలు కనిపించడంతో కరోనా నిర్దారణ పరీక్షలు చేయించుకోగా ఆమెకు కరోనా పాజిటివ్ అని నిర్దారణ అయింది. వైద్యుల సూచనలు పాటిస్తూ హోం క్వారంటైన్‌లో తగు జాగ్రత్తులు తీసుకుంటున్నానని నివేద థామస్ ట్విట్టర్ ద్వారా తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *