జాతిరత్నాలు హీరోయిన్ నెట్టింట్లో హల్ చల్..

జాతిరత్నాలు హీరోయిన్ నెట్టింట్లో హల్ చల్..

 ఆర్.బి.ఎం డెస్క్ హైదరాబాద్: బెయిల్ ఇచ్చేయండి సార్ అంటూ సినీ ప్రేక్షకులందరిని కడుపుబ్బ నవ్వించిన జాతిరత్నాలు హీరోయిన్ తన నటనతో తన అందంతో తన అభినయంతో తెలుగు ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టింది అబ్దుల్లా ఫారియా. జాతిరత్నాలు సినిమాలో నటించిన అబ్దుల్ ఫారియా ఓవర్ నైట్ లో అగ్రతారల జాబితాలో చేరిపోయారు. తెలుగు ప్రేక్షకులకు ఎంతో దగ్గరైనా అబ్దుల్ ఫారియా కు ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో ఆఫర్లు క్యూ కట్టాయి.ఇప్పటికే పలు సినీ దర్శకులు ఆమెకు ఆఫర్ ఇచ్చినట్లుగా సమాచారం.కాగా మాస్ మహారాజా రవితేజ నటించబోయే సినిమాలో అబ్దుల్లా ఫారియాకు అవకాశం వచ్చినట్లు సమాచారం.దీంతో రవితేజ సరసన అబ్దుల్ ఫర్ నటించబోతోందని తెలుస్తోంది.

ఎప్పుడూ సామాజిక మాధ్యమాలలో చురుగ్గా ఉంటూ తన క్యూట్ లుక్స్ తో తనకు నచ్చిన సాంగ్ కి స్టెప్స్ వేస్తూ ఆ వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తోంది. తాజాగా ఫారియా లాక్ డౌన్ సిరీస్ వీడియోలు చేస్తోంది. ప్రేక్షకులు లాక్ డౌన్ నో మర్చిపోయేందుకు వాళ్ళ ముందుకి తన ఫేవరెట్ సాంగ్స్ తో స్టెప్పులు వేస్తూ అందరి హృదయాలను మరోసారి దోచుకునేందుకు ప్రయత్నిస్తున్నారు అబ్దుల్లా ఫారియా.

ఇంస్టాగ్రామ్ లో ఫారియా పోస్ట్ చేసే వీడియోలు చూసి కొంతమంది అసలు ఈమెకు ఏమైంది అని నెగిటివ్ కామెంట్ చేస్తున్నారు మరికొందరు చాలా బాగా చేస్తున్నావ్ అని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.

Leave a Reply

Your email address will not be published.