హీరో లక్ష్ మరో డిఫరెంట్ మూవీ `గ్యాంగ్‌స్టర్ గంగరాజు`…. ఫస్ట్ లుక్ విడుదల
ఆర్.బి.ఎం డెస్క్: హీరో లక్ష్ చదలవాడ… వైవిధ్యమైన కథా చిత్రాలను, విభిన్నమైన పాత్రలను ఎంపిక చేసుకుంటూ యంగ్ టాలెంట్‌ను ఎంకరేజ్ చేస్తున్న కథానాయకుడు. `వలయం` వంటి గ్రిప్పింగ్ సస్పెన్స్ థ్రిల్లర్‌తో అందర్నీ మెప్పించారు. ఆ వెంటనే ఏదో సినిమా చేసేయాలని ఆలోచనతో కాకుండా కాస్త గ్యాప్ తీసుకుని తనదైన పంథాలో `గ్యాంగ్‌స్టర్ గంగరాజు` అనే డిఫరెంట్ మూవీతో ఆకట్టుకోవడానికి సిద్ధమయ్యారు లక్ష్ చదలవాడ.
మంగళవారం `గ్యాంగ్‌స్టర్ గంగరాజు` ఫస్ట్‌లుక్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఫస్ట్‌లుక్‌ను గమనిస్తే సీరియస్‌గా చూస్తున్న పహిల్వాన్స్.. వారి మధ్యలో కూల్‌గా… స్టైల్‌గా కొబ్బరి బొండం తాగుతున్న కూర్చున్నహీరో లక్ష్..కనిపిస్తున్నారు. లుక్ చూస్తుంటే లక్ష్ తన పాత్ర కోసం ట్రాన్స్‌ఫర్మేషన్ బాగానే అయ్యారనేది తెలుస్తుంది. అలాగే తన లుక్ కూడా డిఫరెంట్‌గా ఉంది. కథానాయకుడి పాత్ర సరికొత్త డైమన్షన్‌లో ఉంటుందని లుక్ చూస్తుంటేనే అర్థమవుతుంది.
ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిలిమ్స్ పతాకంపై చదలవాడ బ్రదర్స్ సమర్పణలో పద్మావతి చదలవాడ నిర్మిస్తున్న ఈ చిత్రానికి యంగ్ టాలెంటెడ్ ఇషాన్ సూర్య దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ జరుగుతోంది. ఎన్నో సూపర్ హిట్ చిత్రాలకు సంగీతాన్నందించిన యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ సాయికార్తీక్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు. తొలి సాంగ్‌ను వినాయక చవితి సందర్భంగా విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
నటీనటులు:
లక్ష్ చదలవాడ, వేదిక దత్త, వెన్నెల కిషోర్, చరణ్ దీప్, శ్రీకాంత్ అయ్యంగార్, గోపరాజు రమణ, నిహార్ కపూర్, రాజేశ్వరి నాయర్, సత్యకృష్ణ, రవితేజ, నన్నిమాల, సమ్మెట గాంధీ, రాజేంద్ర, అను మానస, లావణ్య రెడ్డి, అన్నపూర్ణ తదితరులు
సాంకేతిక వర్గం:
దర్శకత్వం: ఇషాన్ సూర్య
నిర్మాత: చదలవాడ పద్మావతి
బ్యానర్: శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిలిమ్స్
సినిమాటోగ్రఫీ: కణ్ణ పి.సి.
సంగీతం: సాయి కార్తీక్
ఎడిటర్: అనుగోజు రేణుకా బాబు
ఫైట్స్: డ్రాగన్ ప్రకాశ్
కొరియోగ్రాఫర్స్: భాను, అనీష్
పి.ఆర్.ఓ: సాయి సతీశ్, పర్వతనేని రాంబాబు