ఘనంగా ‘అంతర్జాతీయ మహిళా దినోత్సవ’ క్రీడా పోస్టర్ ఆవిష్కరణ
ఆర్.బి.ఎం ,హైదరాబాద్: అంతర్జాతీయ మహిళా దినోత్సవం (మార్చి 8) పురస్కరించుకుని నిర్వహించ తలపెట్టిన క్రీడా పోటీలకు సంబంధించిన ప్రత్యేక పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నందకిశోర్ గోకుల్ (DYSO) మాట్లాడుతూ కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ‘మేరా యువ భారత్’ – హైదరాబాద్ విభాగం ఈ వేడుకలను నిర్వహిస్తోందని తెలిపారు. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, ఖేలో ఇండియా మరియు జిల్లా క్రీడల అథారిటీ సంయుక్త భాగస్వామ్యంతో “2026: స్పోర్ట్స్ & సెలబ్రేషన్” అనే థీమ్‌తో ఈ కార్యక్రమాలు జరగనున్నాయని ఆయన పేర్కొన్నారు. మార్చి 8వ తేదీ ఉదయం 7:00 గంటలకు సికింద్రాబాద్‌లోని జిమ్ఖానా గ్రౌండ్స్‌లో పరుగు పందాలను ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఈ పోటీలను మూడు వయస్సు విభాగాల్లో (13 ఏళ్ల లోపు, 13-18 ఏళ్ల మధ్య, మరియు 18 ఏళ్ల పైబడిన వారు) నిర్వహిస్తున్నామని, అథ్లెటిక్స్ విభాగంలో 100 మీటర్లు, 200 మీటర్లు మరియు 400 మీటర్ల పరుగు పందాలు ఉంటాయని వివరించారు. కేవలం పరుగు పందాలే కాకుండా, పాల్గొనే వారందరికీ తమ సృజనాత్మకతను చాటుకోవడానికి వివిధ ఈవెంట్లలో పాల్గొనే అవకాశం కూడా ఉంటుందని ఆయన చెప్పారు. ఫిట్ ఇండియా లక్ష్యంతో, మహిళల్లో క్రీడా చైతన్యం తీసుకురావడమే ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశమని, నగరంలోని మహిళలు మరియు విద్యార్థినులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ వేడుకలను విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో కుశబూ గుప్త ( District youth officer/ my bharat kendra) p.మనోజ్ రెడ్డి (Boxing Coach) నిరీషన్ రెడ్డి ( Khelo india kabadi Coach), సునాద్ (Athletes coach),తదితరులు పాల్గొన్నారు.
