భారత రాజ్యాంగ నిర్మాత, గొప్ప సంఘ సంస్కర్త డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్: ప్రకాష్ గౌడ్, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే
ఆర్.బి.ఎం డెస్క్:. డా. బి. ఆర్ అంబేద్కర్ గారి 134 జయంతి సందర్భంగా ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ గారు రాజేంద్రనగర్ నియోజకవర్గంలోని మైలార్‌దేవ్‌పల్లి డివిజన్, శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని పలుచోట్ల అంబేద్కర్ విగ్రహనికి పూల మాల వేసి నివాళులు అర్పించారు…
ఈ సందర్భంగా అయన మాట్లాడుతు.. భారత రాజ్యాంగ నిర్మాత, గొప్ప సంఘ సంస్కర్త డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు! ఆయన కేవలం ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి. అణగారిన వర్గాల కోసం ఆయన చేసిన పోరాటం, రాజ్యాంగం ద్వారా ఆయన కల్పించిన సమానత్వం ఎప్పటికీ గుర్తుండిపోతాయి.ఆయన చూపిన బాటలో నడుస్తూ, సమాజంలో మరింత న్యాయం, సమానత్వం సాధించడానికి మనమందరం కలిసి కృషి చేద్దాం. అంబేద్కర్ గారి ఆశయాలను కొనసాగిద్దాం అని ప్రకాష్ గౌడ్ చెప్పుకొచ్చారు.
