నిన్ను నువ్వు తెలుసుకోవడమే అసలైన విద్య

నిన్ను నువ్వు తెలుసుకోవడమే అసలైన విద్య

హైదరాబాద్: ప్రతి ఒక్కరిలో ఉండే శక్తి సామర్థ్యాలను వెలికి తీసేదే అసలైన విద్య అని సామాజిక కార్యకర్త, రామకృష్ణ మఠం వాలంటీర్ ఆరేపాటి వెంకట నారాయణ రావు చెప్పారు. ఆత్మసాక్షాత్కారానికి తోడ్పడేది నిజమైన విద్య అని చెప్పారు. సికింద్రాబాద్ ప్యాట్నీ సెంటర్లోని హరిహర కళాభవన్ లో శాంతినికేతన్ విద్యాసంస్థల ‘శాన్ ” స్కూల్ వార్షికోత్సవానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. భారత్ ను విశ్వ గురువుచేయాలన్న స్వామి వివేకానంద కలను విద్యార్థులే సాకారం చేయగలరని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. విలువలతో కూడిన విద్యను అందిస్తున్న శాంతినికేతన్ స్కూల్ యాజమాన్యాన్ని ఆయన ప్రశంసించారు. ఈ సందర్భంగా విద్యా సంవత్సరంలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థినీ విద్యార్థులకు సర్టిఫికెట్లు, మెడల్స్ అందజేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా మార్షల్ ఆర్ట్స్ ఊపిరి బిగబట్టేలా చేశాయి. కార్యక్రమంలో శాంతినికేతన్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ యాజమాన్యం, ప్రిన్సిపాళ్లు, యోగ గురువు లివాంకర్, మణిశంకర్ మణికంఠన్, శ్రీవిద్య, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *