యాదాద్రిలో చిచ్చు రేపిన ప్రేమ

యాదాద్రి: ఈ దేశంలో ప్రేమించి పెళ్లి చేసుకోవడాన్ని ఇంకా నేరంగానే పరిగణిస్తున్నారు. ప్రేమ వివాహాలను పెద్దలు సహించడం లేదు. కొన్నిసార్లు ప్రేమ వివాహాలు చేసుకున్నవారిని చంపేందుకు కూడా వెనుకాడడం లేదు. ఇలాంటి ఘటనే యాదాద్రి జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని తుర్కపల్లి మండలం గంధమల్ల గ్రామంలో ప్రేమ వివాహం చిచ్చు రేపింది. ప్రేమ వివాహం చేసుకున్నాడని వరుడి ఇల్లును తగలబెట్టారు. వేముల భాను అనే యువకుడు అదే గ్రామానికి చెందిన యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి ఫోటోలను భాను వాట్సాప్ గ్రూప్‌లో షేర్ చేశాడు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన యువతి కుటుంబసభ్యులు భాను ఇంటిని తగలబెట్టారు. తనకు తన భార్యకు ప్రాణహాని ఉందని పోలీసులు భాను ఫిర్యాదు చేశారు. యువకుడి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *