బీజేపీలో చేరిన ఎర్రబల్లి.. కండవా కప్పిన ఆ పార్టీ నేత జేపీనడ్డా..

బీజేపీలో చేరిన ఎర్రబల్లి.. కండవా కప్పిన ఆ పార్టీ నేత జేపీనడ్డా..

ఆర్.బి.ఎం ఢిల్లీ: ఎర్రబల్లి ప్రదీప్‌రావు బీజేపీలో చేరారు. ఆయనకు బీజేపీ కండవా కప్పి ఆ పార్టీ నేత జేపీనడ్డా పార్టీలోకి నడ్డా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ప్రదీప్‌రావు మాట్లాడుతూ తెలంగాణలో బీజేపీకి మంచి మూమెంట్ ఉందని ప్రశంసించారు. రాష్ట్రంలో బీజేపీని అధికారంలోకి తెచ్చేందుకు కృషిచేస్తానని ప్రకటించారు. ప్రదీప్‌రావు మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావుకు స్వయాన సోదరుడు. ఎమ్మెల్యే నరేందర్‌తో ప్రదీప్‌రావుకు కొంతకాలం విభేదాలున్నట్లు చెబుతున్నారు. గత ఎన్నికల్లో ఎన్నికల్లో వరంగల్‌ తూర్పు నియోజకవర్గ టికెట్ ప్రదీప్‌రావు ఆశించారు. అయితే ఈ టికెట్‌ను నరేందర్‌కు ఇచ్చారు. అప్పట్లో ప్రదీప్‌రావు అసంతృప్తి వ్యక్తం చేయడంతో ఎమ్మెల్సీ చేస్తామని బుజ్జగించారు. రోజులు గడుస్తున్నా తనకు ఇచ్చిన హామీని టీఆర్‌ఎస్ అధిష్టానం నెరవేర్చకపోవడంతోనే ఆయన బీజేపీలో చేరినట్లు చెబుతున్నారు. ఇప్పటికే తన సోదరుడు మంత్రిగా ఉన్నారు. టీఆర్‌ఎస్‌లో తనకు గుర్తింపు ఇవ్వడం లేదనే కారణంతోనే టీఆర్‌ఎస్‌కు పార్టీకి రాజీనామా చేశారు. ప్రదీప్‌రావు బీజేపీలో చేరడానికి ఈటల రాజేందర్ పాత్ర చాలా ఉందని చెబుతున్నారు. ఆయనతో ఈటల పలు దఫాలుగా చర్చలు జరిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *