రాజాసింగ్‌ మళ్లీ అరెస్ట్‌..

రాజాసింగ్‌ మళ్లీ అరెస్ట్‌..

ఆర్.బి.ఎం హైదరాబాద్: ఎమ్మెల్యే రాజాసింగ్‌ను మంగళ్‌హాట్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. అరెస్ట్‌ చేసి నాంపల్లి కోర్టుకు పోలీసులు తరలించారు. ఇప్పటికే రాజాసింగ్‌కు రెండు పాత కేసుల్లో పోలీసులు నోటీసులిచ్చారు. రాజాసింగ్‌పై 41 A సీఆర్పీసీ కింద మంగళ్‌హాట్ పోలీసులు నోటీసులిచ్చారు. సెక్షన్ 505(2), 171 cr/w, 171f, 123, 125/Rp యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. రాజాసింగ్‌పై షాఇనాయత్‌ గంజ్‌ పీఎస్‌లో కేసు నమోదు చేశారు. 153(A), 295(A) 504, 505/2 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు.

రాజాసింగ్ మంగళవారం మహ్మద్‌ ప్రవక్తపై, ఇస్లాం మతంపై వివాదాస్పద వ్యాఖ్యలు అలజడి సృష్టించాయి. ఆయన వ్యాఖ్యలపై ముస్లింలు ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు పోలీసులకు ఫిర్యాదులు చేయడంతో మంగళవారం అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి కోర్టులో రాజాసింగ్‌ను ప్రవేశపెట్టారు. ఆయనకు కోర్టు 14 రోజుల రిమాండు విధించింది. అయితే పోలీసులు ఆయన అరెస్టులో నిబంధనలు పాటించలేదని రాజాసింగ్‌ తరపు న్యాయవాది కోర్టు దృష్టికి తెచ్చారు. అనంతరం న్యాయస్థానం ఆయనకు బెయిల్‌ మంజూరు చేసింది. ఇలా ఉండగానే ఈ రోజు మరోసారి పోలీసులు అరెస్ట్ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *