బీజేపీలోకి తీన్మార్ మల్లన్న.. వారి సమక్షంలోనే పార్టీలోకి
ఆర్.బి.ఎం హైదరాబాద్: జర్నలిస్ట్, క్యూ న్యూస్ అధినేత తీన్మార్ మల్లన్న బీజేపీలో చేరుతున్నారనే ప్రచారం జరుగుతోంది. తీన్మార్ మల్లన్న బీజేపీ సిద్ధాంతాలకు ఆకర్షితుడై ఆ పార్టీలో చేరేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. గత కొంతకాలంగా ఆయన బీజేపీ అండదండలతోనే టీఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని సీఎం కేసీఆర్‌ను టార్గెట్ చేస్తున్నారనే విమర్శలు వచ్చాయి. అయితే ఇంతకాలం మౌనంగా ఉన్న టీఆర్‌ఎస్ ప్రభుత్వం మల్లన్నపై అనేక కేసులు పెట్టి జైలు పంపింది. ఈ క్రమంలో మల్లన్నను విడుదల చేయించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి, కేంద్రమంత్రి అమిత్ షాను మల్లన్న భార్య ఈ మెయిల్ ద్వారా వేడుకుందని చెబుతున్నారు. ఆయన జైలు నుంచి బెయిల్ విడుదల అయిన వెంటనే బీజేపీలో చేరుతారని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే బీజేపీ నేతలతో సంప్రదింపులు జరిపారని ఇక బీజేపీలో చేరడయే తరువాయి అని చెబుతున్నారు. మరోవైపు మల్లన్నను బెయిల్ పై విడిపించుకునేందుకు బీజేపీ నేతలు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
