రేవంత్ రెడ్డిని జైలుకు పంపుతాం..! భాస్కర్ రావు, ఎమ్మెల్యే

రేవంత్ రెడ్డిని జైలుకు పంపుతాం..! భాస్కర్ రావు, ఎమ్మెల్యే

ఆర్.బి.ఎం డెస్క్ హైదరాబాద్: తెరాస ప్రభుత్వం తల్చుకుంటే టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని జైలుకు పంపే అవకాశం ఉందని సంచలన వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే భాస్కర్ రావు.సోమవారం నాడు జరిగిన సభలో రాష్ట్ర ముఖ్యమంత్రిపై రేవంత్ రెడ్డి చేసిన విమర్శలను భాస్కర్ రావు ఖండించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే భాస్కర్ రావు మాట్లాడుతూ కెసిఆర్ పై రేవంత్ రెడ్డి వ్యక్తిగత విమర్శలకు దిగవద్దని సూచించారు. నిన్న జరిగిన సభలో రేవంత్ రెడ్డి ప్రసంగం విధి రౌడీని తలపించేలా ఉందని భాస్కర్ రావు పేర్కొన్నారు. ప్రజలు అన్ని గమనిస్తున్నారని రేవంత్ రెడ్డి మాటలు నమ్మే స్థితిలో ఎవరు లేరని అయన అన్నారు. రేవంత్ రెడ్డిని జైలుకు పంపడం తమకు చిన్న విషయం అని అన్నారు. కెసిఆర్ ను జైలుకు పంపడం రేవంత్ రెడ్డికి సాధ్యం కాదని రేవంత్ రెడ్డి కల ఎప్పటి నెరవేరదని భాస్కర్ రావు వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీ జన్మలో అధికారంలోకి రాదని అయన అన్నారు. రేవంత్ రెడ్డి సీఎం అవ్వాలనే కల ఎప్పటికి నెరవేరదని భాస్కర్ రావు అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రజలు ఎన్నో బాధలు అనుభవించారని కెసిఆర్ తెలంగాణ తీసుకురావడం వల్లే తెలంగాణ ప్రజలం తల ఎత్తుకుని తిరుగుతున్నామని ఎమ్మెల్యే భాస్కర్ రావు అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *