తెలంగాణ నుంచి పోసానిని బహిష్కరించాలి: జనసేన
ఆర్.బి.ఎం హైదరాబాద్: తెలంగాణ నుంచి దర్శకుడు పోసాని మురళీకృష్ణను బహిష్కరించాలని జనసేన మహిళ విభాగం డిమాండ్ చేసింది. సైబరాబాద్ సీపీ ఆఫీస్‌కు జనసేన మహిళ విభాగంకు చెందిన కార్యకర్తలు వెళ్లారు. పోసానిపై ఫిర్యాదు చేయడానికి వచ్చామని జనసేన మహిళ విభాగం నేతలు తెలిపారు. మహిళలపై పోసాని వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని కోరారు. నిన్న ప్రెస్‌క్లబ్‌లో మహిళలను టార్గెట్ చేసి పోసాని మాట్లాడారని, పవన్‌కల్యాణ్‌పై కోపంతో మహిళలను దూషించడం సరికాదని తప్పుబట్టారు. పవన్‌కల్యాణ్ ఎక్కడ కూడా పోసాని గురించి మాట్లాడలేదని తెలిపారు. తాము ఎక్కడా పోసానిపై దాడి చేయలేదని మహిళ విభాగం నేతలు తెలిపారు.
