కేసీఆర్ వ్యూహం బెడిసి కొట్టింది: ఎంపీ అర్వింద్
ఆర్.బి.ఎం నిజామాబాద్: ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలతో సీఎం కేసీఆర్ వ్యూహం బెడిసికొట్టిందని ఎంపీ అర్వింద్ అన్నారు. బీజేపీ తెలంగాణలోనూ అధికారంలోకి వచ్చే అవకాశం ఉండడంతో కేసీఆర్ అయోమయానికి గురవుతున్నారని ఎద్దేవాచేశారు. రా రైస్‌ను కొనబోమని కేంద్ర ప్రభుత్వం ఎప్పుడూ చెప్పలేదని తెలిపారు. అధికార పార్టీ నేతలు కావాలనే ధాన్యాన్ని కొనుగోలు చేయకుండా రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజల దృష్టి మరల్చడానికే ధాన్యం కొనుగోలు చేయకుండా ఆందోళనలు చేస్తున్నారని విమర్శించారు. కేటీఆర్ సీఎం కాకుండా మంత్రి హరీష్‌రావు, కవిత, సంతోష్‌రావులు అడ్డుకుంటున్నారని తెలిపారు. బోధన్ నియోజకవర్గంలో బీజేపీ బలపడుతుందనే భయంతోనే కార్యకర్తలను భయబ్రాంతులకు గురిచేస్తున్నారని మండిపడ్దారు. ఆర్మూర్‌లో తనపై దాడి జరిగినపుడు తాను ఫిర్యాదు చేస్తే ఇప్పటి వరకు ఒక్క కేసు కూడా ఎందుకు నమోదు చేయలేదని అర్వింద్ ప్రశ్నించా
