ఐ బొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవితోనే ఆ పని చేయించిన పోలీసులు
ఆర్.బి.ఎం, హైదరాబాద్: పైరసీ సినిమాలకు కేంద్రంగా మారిన ఐ బొమ్మ, బప్పం టీవీ వెబ్సైట్లను హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు మూసి వేయించారు. శనివారం రోజు కూకట్పల్లిలో నివాసముంటున్న ఐ బొమ్మ నిర్వాహకుడు ఇమిడి రవిని వారి ఇంట్లో పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ వెబ్సైట్లను ఆయనతోనే క్లోజ్ చేయించారు. వెబ్ లాగిన్ సర్వర్ వివరాలతో మూయించేశారు. నా వద్ద కోట్ల మంది డేటా ఉంది. నాపై పోలీసులు ఫోకస్ చేయడం మానేయాలంటూ గతంలో ఇమిడి రవి పోలీసులకు వార్నింగ్ ఇచ్చినట్టు అప్పట్లో సామాజిక మాధ్యమాల్లో ఒక లెటర్ రవి పేరుతో తెగ చెక్కర్లు కొట్టేసింది. ఈ సవాల్ ను స్వీకరించిన సైబర్ క్రైమ్ పోలీసులు ఎట్టకేలకు ఇమ్మిడి రవిని పట్టుకొని అతని చేత్తోనే ఐ బొమ్మ లాంటి వెబ్సైట్లను క్లోజ్ చేయించారు.
