వృద్ధ దంపతులపై దాడి ఆపై దోపిడి
ఆర్.బి.ఎం డెస్క్ హైదరాబాద్: వృద్ధ దంపతులపై దాడి చేసి ఆపై దోపిడికి పాల్పడిన ఘటన కెపిహెచ్బి ఏడవ ఫేస్ ఎంఐజి 14 లో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం కెపిహెచ్బి ఏడవ ఫేస్ ఎంఐజి 14 లో నివాసం ఉంటున్న నాగేశ్వరరావు అతని భార్య సరస్వతి ప్రభుత్వ విశ్రాంతి ఉద్యోగులు. రాత్రి వారు నిద్రిస్తున్న సమయంలో ఇంట్లోకి చొరబడిన ముగ్గురు వ్యక్తులు వీరిపై దాడి చేసి 20 తులాల బంగారం మూడు లక్షల నగదు చోరీ చేశారు.ఇదే క్రమంలో వీరి పక్క ఇంట్లో కూడా దోపిడీకి ప్రయత్నించటంతో వారు మేల్కొని ఎదురు తిరగడంతో పారిపోయిన దుండగులు.
