చాక్లెట్ లో పురుగులు.. ప్రశ్నిచినందుకు మహిళ రిపోర్టర్ పై దాడి చేసిన రిలయన్స్ యాజమాన్యం

చాక్లెట్ లో పురుగులు.. ప్రశ్నిచినందుకు మహిళ రిపోర్టర్ పై దాడి చేసిన రిలయన్స్ యాజమాన్యం

గుడిమల్కాపూర్: గుడిమల్కాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆర్.బి.ఎం ఛానల్ కి సంబంధించిన మహిళ రిపోర్టర్ పై రిలయన్స్ యాజమాన్యం దాడి.

ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఆర్. బి. ఎం న్యూస్ ఛానల్లో రిపోర్టర్గా విధులు నిర్వహిస్తున్న నాగదుర్గ అనే మహిళ ఎప్పటిలాగే తనకు కావాల్సిన తినుబండారాలు గుడిమల్కాపూర్ లోని రిలయన్స్ మార్ట్ లో కొనుగోలు చేసింది. అనంతరం అందులో ఆమె కొన్న చాక్లెట్లు తన స్నేహితులతో కలిసి తింటున్న క్రమంలో ఒక్కసారిగా ఆ చాక్లెట్ కవర్లో నుండి పురుగులు రావడం చూసి అక్కడ ఉన్న వారంతా ఆశ్చర్యానికి గురైయ్యారు.

ఈరోజు(Wednesday, 2 July 2025) ఆ చాక్లెట్ కవర్ ను తీసుకోని నేరుగా గుడిమల్కాపూర్ లోని రిలయన్స్ మార్ట్ కు వెళ్లి ఆ చాక్లెట్లో ఉన్న పురుగులను రిలయన్స్ మార్ట్ సిబ్బందికి చూపించి నిలదీశారు. అయితే రిపోర్టర్ అడిగిన ఏ ప్రశ్నకు కూడా వారి వద్ద సమాధానం లేదు. మహిళా రిపోర్టర్ కాబట్టి ఆమెను ఏమి చేయలేక మొదట్లో వీడియో తీస్తున్న కెమెరామెన్ ను బూతులు తిడుతూ పిడిగుద్దులు గుద్దే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత తన కెమెరామెన్ ను వారి నుంచి కాపాడే ప్రయత్నం చేసిన రిపోర్టర్ ను కూడా పలు సందర్భంలో దుర్భాషలాడుతూ చేయి చేసుకున్నంత పని చేశారు.

ఈ నేపథ్యంలో రిపోర్టర్ కు ఏం చేయాలో అర్ధమవ్వక 100కు డయల్ చేయగా వెంటనే అక్కడికి రెండు పోలీస్ వాహనాలు వచ్చాయి. రిపోర్టర్ పోలీసులకు అక్కడ జరిగిన విషయాన్ని వివరించింది. రిపోర్టర్ పై దాడికి యత్నించిన పలువురు రిలయన్స్ మార్ట్ సిబ్బందిని పోలీసులు గుడిమల్కాపూర్ పోలీస్ స్టేషన్ కు తరలించారు.

రిపోర్టర్ నాగదుర్గ ఇచ్చిన ఫిర్యాదు మేరకు గుడిమల్కాపూర్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే రిపోర్టర్ నాగదుర్గ తనకు ఎలాగైనా న్యాయం జరగాలంటూ పోలీసులకు మొరపెట్టుకుంది. దానికి పోలీసులు సానుకూలంగా స్పందించినట్లు ఆమె చెప్పుకొచ్చింది.

https://youtu.be/KjdgLvVmWSw?si=oW-CMrkPIBvvEgbF

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *