సంక్రాంతి ప్రీమియర్ లీగ్ ఫైనల్ విజేత “కింగ్స్ 11”

సంక్రాంతి ప్రీమియర్ లీగ్ అంతకపెట్ లో జరుగుచున్న క్రికెట్ పోటీల్లో భాగంగా టీం స్పిరిట్ టీం అండ్ కింగ్స్ ఎలెవన్ టీంలు ఫైనల్లోకి చేరుకోవడం జరిగింది.

ఈ రోజు జరిగిన ఫైనల్ మ్యాచులో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కింగ్స్ ఎలెవన్ టీం నిర్ణీత పన్నెండు ఓవర్లల్లో 7 వికెట్లు కోల్పోయి 107 పరుగులు సాధించింది.తర్వాత బ్యాటింగ్ చేసిన టీం స్పిరిట్ 12 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 76 పరుగులు మాత్రమే సాధించింది.కింగ్స్ ఎలెవన్ టీం 31 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో అత్యుత్తమ బ్యాటింగ్ కనబరిచిన వెంకటేష్ 31(12) కి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అత్యుత్తమ బౌలింగ్ హ్యాట్రిక్ కనబరిచిన పూదరి ప్రకాష్ కి(4 వికెట్లు) ఉత్తమ బౌలర్ అవార్డు ఇవ్వడం జరిగింది.

టోర్నీలో గెలిచిన కింగ్స్ ఎలెవన్ టీం కి ప్రతమ బహుమతిగా 25000 రూపాయలు రాయిరెడ్డి రాజిరెడ్డి గారు ఇవ్వడం జరిగింది.రన్నర్స్ టీం కి 15000 రూపాయలు వేముల సంపత్,పెండల అశోక్ రెడ్డి,పూoడ్ర రవీందర్ రెడ్డి,బింగి ప్రమోద్ లు ఇవ్వడం జరిగింది. ఈ మొత్తం టోర్నమెంట్ కి షీల్డ్ లు కొయ్యాడ సృజన్ కుమార్ గారు వారి నానమ్మ &తాతయ్య గార్ల జ్ఞాపకార్థం ఇవ్వడం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *