ప్రజలను చల్లగా చూడు తల్లి: మల్లు నందిని (డిప్యూటీ సీఎం భట్టి సతీమణి)
హైదరాబాద్, సెప్టెంబర్ 27: ఓల్డ్ బోయిన్ పల్లిలోని శివ దుర్గ ఎల్లమ్మ తల్లి సమేత దేవస్థానంలో నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సతీమణి మల్లు నందిని శనివారం అమ్మవారి మండపాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు.
ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన మల్లు నందిని “ప్రజలను చల్లగా చూడు తల్లి అందరికీ ఆరోగ్యం, ఆనందం కలగాలని ప్రార్థించాను” అని అమె తెలిపారు. తనను ఈ కార్యక్రమానికి ఆహ్వానించినందుకు టి.పి.సి.సి రాష్ట్ర కార్యదర్శి దండుగుల యాదగిరికి కృతజ్ఞతలు తెలిపారు. మతపరమైన ఉత్సవాలు ప్రజల ఏకతా, విశ్వాసాలకు ప్రతీకలని, ప్రభుత్వం తరఫున సంప్రదాయాలను కాపాడేందుకు ఎల్లప్పుడూ సహకారం అందిస్తామని ఆమె ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో దేవస్థాన కమిటీ సభ్యులు, స్థానిక నాయకులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందారు. ఆలయ ప్రాంగణం భక్తుల సందడితో కిక్కిరిసిపోయింది.

