సికింద్రాబాద్లోని పలు వినాయక మండపాలను సందర్శించిన మందుల శ్రవణ్
సికింద్రాబాద్ కంటోన్మెంట్ బిజెపి వార్డు –2 డివిజన్ అధ్యక్షులు మందుల శ్రవణ్ బీరప్ప టెంపుల్ , ఇంద్రమ్మ నగర్, పెద్ద రోడ్, గన్ బజార్, ఎయిర్పోర్ట్ గేట్ గల పలు గణేశుడి మండపాలను నిర్వాహకుల ఆహ్వాన మేరకు సందర్శించి పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా మందుల శ్రవణ్ ఆర్.బి.ఎమ్ మీడియాతో మాట్లాడుతూ వినాయకుడి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని, ఐక్యత, భక్తి శ్రద్ధలతో నవరాత్రి వేడుకలు జరుపుకోవాలని ఆయన అన్నారు. ఎలాంటి విఘ్నాలు లేకుండా తెలంగాణ సమాజం ముందుకు సాగాలని శ్రవణ్ ఆకాంక్షించారు . ఏకదంతుడి దీవెనలతో ప్రజలంతా శాంతి, సౌభ్రాతృత్వం వెల్లివిరిసేలా ప్రశాంత వాతావరణంలో గణపతి నవరాత్రి ఉత్సవాలు జరుపుకోవాలని మందుల శ్రవణ్ విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి సీనియర్ నాయకులు ఓబీసీ మోర్చా నాయకులు రామాంజనేయులు, ఎస్సీ మోక్ష కంటోన్మెంట్ జాయింట్ కన్వీనర్ శ్రీశైలం, మహిళా మోర్చా వార్డు అధ్యక్షులు మమత, ఓబిసి మోర్చా నాయకుడు పరశురాం యాదవ్, వార్డు –2 ట్రెజరర్ భానుచందర్ , గోపి, శివ, రాజు, శివ, చరణ్, కన్నా తదితరులు పాల్గొన్నారు.

