తెలంగాణలో జూడోకు ఎంతో ఆదరణ

తెలంగాణలో జూడోకు ఎంతో ఆదరణ

నేషనల్ జూడో చాంపియన్షిప్ పోస్టర్ ఆవిష్కరించిన క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి

తెలంగాణ క్రీడా శాఖ అందిస్తున్న ప్రోత్సాహక విధానాలతో అనేక జాతీయ అంతర్జాతీయ క్రీడా పోటీలు నిర్వహించడానికి అనేక జాతీయ ఫెడరేషన్లు ముందుకు వస్తున్నాయని తెలంగాణ క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. నవంబరు 3తేదీ నుండి 7తేదీ వరకు కే వి ఆర్ ఇండోర్ స్టేడియంలో నిర్వహించబోయే సబ్ జూనియర్ నేషనల్ జూడో చాంపియన్ షిప్ ఫర్ బాయ్స్ అండ్ గర్ల్స్ 2025 పోస్టర్ ను ఈరోజు గచ్చిబౌలిస్టేడియంలో రాష్ట్ర ప్రభుత్వ క్రీడల సలహాదారులు ఏపీ జితేందర్ రెడ్డి స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేన రెడ్డితో కలిసి ఆయన ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సీఎం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కల్పిస్తోన్న క్రీడా ప్రోత్సాహక విధానాలతో అనేక జాతీయ క్రీడా ఫెడరేషన్లు పలు జాతీయ అంతర్జాతీయ పోటీలు నిర్వహించడానికి హైదరాబాదును వేదికగా ఎంచుకుంటున్నారని అన్నారు.

ఒలంపిక్ క్రీడా ఆయన జూడో కు తెలంగాణలో ఎంతో ఆదరణ ఉందని జూడో పోటీలు నిర్వహించడం వల్ల ఔత్సాహిక క్రీడాకారుల్లో ఉత్సాహం వస్తుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీ జితేందర్ రెడ్డి శివసేనారెడ్డి తోపాటు స్పోర్ట్స్ అథారిటీ ఎండి డాక్టర్ సోనీ బాలాదేవి తెలంగాణ జూడో అసోసియేషన్ చైర్మన్, మరియు తెలంగాణ సహకార ఫిషరీస్ కో-ఆపరేటివ్ సొసైటీ ఫెడరేషన్ చైర్మన్ మెట్టు సాయికుమార్, జూడో అసోసియేషన్ అధ్యక్షులు బి కైలాస్ యాదవ్ ఉపాధ్యక్షుడు జి రమాదేవి జి రామ్ లక్ష్మణ్ కోశాధికారి రవీందర్ టెక్నికల్ కమిటీ చైర్మన్ సిహెచ్ రాము సభ్యులు నర్సింగ్ రావు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *