- క్రీడా శాఖలో సమూల మార్పు
- విధుల్లో అలసత్వం వద్దు
- స్పోర్ట్స్ స్కూళ్ల ఎంపికలో పైరవీలకు తావు లేదు
- స్పోర్ట్స్ స్కూళ్ల పనితీరు మెరుగుపడాలి
- క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి
తెలంగాణ క్రీడా పాఠశాలల్లో సమూల మార్పు జరగాల్సిన అవసరం ఉందని రాష్ట్ర క్రీడ యువజన సర్వీసులు మరియు పశుసంవర్ధక, డైరీ డెవలప్మెంట్ శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు.
ఈరోజు హకీంపేటలోని తెలంగాణ ప్రభుత్వ క్రీడా పాఠశాలను స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి తో కలిసి సందర్శించారు.
ఈ సందర్భంగా ఈరోజు నుంచి ప్రారంభమైన రాష్ట్రస్థాయి క్రీడా పాఠశాల ఎంపికల ప్రక్రియను ఆయన పర్యవేక్షించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలంగాణ ప్రభుత్వ క్రీడా శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న తెలంగాణ క్రీడా పాఠశాలలు హకీంపేట కరీంనగర్ అదిలాబాదుల లో క్రీడా పాఠశాల నిర్వహణలో సమూలమైన మార్పులు జరగాల్సిన అవసరం ఉందని మూడు నెలల్లో వీటి పనితీరును మెరుగుపరిచి చూపిస్తామని ఆయన ప్రకటించారు.
క్రీడా పాట శాలల ఎంపికలో ఎటువంటి పైరవీలకు ఆస్కారం ఉండకూడదని, పాఠశాలల విద్యార్థుల ఎంపికలో ఎటువంటి ఒత్తిడిలు వచ్చిన పారదర్శకంగా వ్యవహరించి క్రీడల్లో ప్రతిభ ఉన్న వారిని ఎంపిక చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు.
కరీంనగర్ అదిలాబాద్ లో ఉన్న పాఠశాలల కూడా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు.
క్రీడాకారుల ఎంపిక ప్రక్రియ సందర్భంగా విద్యార్థుల్లో తల్లిదండ్రులు అందరితో ఆయన మాట్లాడుతూ, ఎంపిక కానీ పిల్లలను క్రీడలకు దూరం చేయకుండా వారిని క్రీడల్లో రాణించే విధంగా ప్రోత్సహించాలని సూచించారు.
క్రీడలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్న సీఎం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో క్రీడా పాఠశాలలు అకాడమీ లలో విద్యార్థుల ఎంపిక తర్వాత వారికి మెరుగైన శిక్షణ ఇచ్చే విధంగా కోచులు సిబ్బంది శ్రద్ధ వహించాలన్నారు.
నూతన క్రీడా విధానం అనుసరించి అంచలంచలుగా కోచులు మరియు క్రీడా సిబ్బంది సంఖ్యను పెంచుకుంటూ పోవడమే కాకుండా , ప్రతి సంవత్సరం కోచులకు పునఃశ్చరణ తరగతులు నిర్వహించి వారి పనితీరును మెరుగు పరుస్తామని అన్నారు.
ఫలితాలు సాధించే కోచులను ప్రోత్సహిస్తూనే, ఫలితాలు తీసుకురాని, క్రీడా శిక్షకులను ఉపేక్షించబోమని ఆయన అన్నారు.
ఇకముందు స్పోర్ట్స్ స్కూల్ లను అకాడమీ లను ఆకస్మికంగా తనిఖీ చేసి, ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా పనిచేయని వారిపై చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.
ఈ సందర్భంగా ఆయన స్పోర్ట్స్ స్కూల్ క్యాంటీన్, కిచెను ను పరిశీలించి మరింత శుభ్రతను పాటించాలని పిల్లలకు అందించే ఆహారం మరింత పరిశుభ్రంగా అందించాలని సూచించారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులతో పాటు లైన్లో నిలబడి, భోజనం తీసుకోవడమే కాకుండా వారితో కలిసి భోజనం చేశారు.
ప్రతి 10 సంవత్సరాల నుండి క్రీడా శాఖ పనితీరు కుంటుపడిందని, సీఎం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అన్ని రంగాల్లో మాదిరిగానే క్రీడా శాఖలో మార్పు మొదలైందని, సీఎం రేవంత్ రెడ్డి గారి ఆలోచన అందుకొని క్రీడాభివృద్ధి కోసం శాఖలో పనిచేస్తున్న ప్రతి ఒక్కరు కృషి చేయాలని ఆయన కోరారు.
ఈ కార్యక్రమంలో స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి మేనేజింగ్ డైరెక్టర్ శ్రీమతి సోనీ బాలాదేవి, స్పోర్ట్స్ స్కూల్ ప్రత్యేక అధికారి టీ మమత, స్పోర్ట్స్ అథారిటీ డిప్యూటీ డైరెక్టర్లు, స్పోర్ట్స్ స్కూల్ సిబ్బంది పాల్గొన్నారు
