ఆర్య నగర్ బస్తీ సమస్యలు పరిష్కరిస్తాం : పద్మారావు గౌడ్
ఆర్.బి.ఎం సికింద్రాబాద్ : తార్నాక డివిజన్ లోని ఆర్య నగర్ ప్రజలు ఎదుర్కొంటున్న అన్ని సమస్యలు పరిష్కరిస్తామని సికింద్రాబాద్ శాసనసభ్యులు, మాజీ డిప్యూటీ స్పీకర్ తీగుల్ల పద్మారావు గౌడ్ తెలిపారు. అర్యనగర్ స్థానిక సంక్షేమ సంఘం ప్రతినిధులు గురువారం సితాఫలమండీ లోని ఎం.ఎల్.ఏ. క్యాంపు కార్యాలయంలో పద్మారావు గౌడ్ తో సమావేశమై వివిధ సమస్యల పై వినతి పత్రాన్ని సమర్పించారు. పోలీసు గస్తీ పెంచాలని, సీ.సీ. కెమెరాలు ఏర్పాటు చేయాలనీ, రోడ్డు పునర్నిర్మానాన్ని చేపట్టాలని, వీధి దీపాలు ఏర్పాటు చేయాలనీ సంఘం నేతలు కుమార్ షాను, హరి కృష్ణ తదితరులు కోరారు. కమ్యూనిటీ హాల్ నిర్మాణం పనులను వెంటనే పూర్తి చేయించాలని కోరారు. వారి సమస్యలను వెంటనే పరిష్కరిస్తామని పద్మారావు గౌడ్ ఈ సందర్భంగా పేర్కొన్నారు.
