అడ్డగుట్టలో రూ. 6 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన పద్మారావు గౌడ్
ఆర్.బి.ఎం : అడ్డగుట్ట సర్వతోముఖాభివృద్దిని దృష్టిలో ఉoచుకొని వివిధ అభివృద్ది పనులను చేపట్టమని, పదేళ్ళలో అడ్డగుట్టను ఆదర్శ ప్రాంతంగా తీర్చిదిద్దామని సికింద్రాబాద్ శాసనసభ్యులు, మాజీ డిప్యూటీ స్పీకర్ తీగుళ్ళ పద్మారావు గౌడ్ అన్నారు. అడ్డగుట్ట మున్సిపల్ డివిజన్ పరిధిలో గురువారం పద్మారావు గౌడ్ విస్తృతంగా పర్యటించారు. దాదాపు రూ. 6 కోట్ల విలువజేసే వివిధ అభివృద్ది పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పదేళ్ళలో సికింద్రాబాద్ నియోజకవర్గంలో 50 సంవత్సరాలలో చేపట్టని పనులను పూర్తి చేశామని తెలిపారు. అడ్డగుట్ట అభివృద్ది పై ప్రత్యేక దృష్టి సారించామని తెలిపారు. తుకారాం గేట్ ఆర్. యు. బీ. నిర్మాణం మొదలుకొని ఫంక్షన్ హాల్ నిర్మాణం, ఆసుపత్రి నిర్మాణం వంటి ముఖ్యమైన ప్రొజెక్టులను తమ హయాంలో చేపట్టమని తెలిపారు. మున్ముందు రోజుల్లో కూడా సికింద్రాబాద్ నియోజకవర్గానికి చెందిన ఎనిమిది కొత్త డివిజన్ల ను కూడా నిరంతరం అభివృద్ది పధంలో నడుపుతామని పద్మారావు గౌడ్ స్పస్టం చేశారు. అడ్డగుట్ట కార్పొరేటర్ లింగాని ప్రసన్న లక్ష్మీ శ్రీనివాస్ మాట్లాడుతూ అడ్డగుట్ట అభివృద్దిలో స్థానిక శాసనసభ్యులు తీగుళ్ళ పద్మారావు గౌడ్ పాత్ర ప్రశంసనీయమని తెలిపారు. అధికారులు , హేమూ నాయక్, విద్యా సాగర్, శ్రవంతి, యువ నేత రామేశ్వర గౌడ్, సమన్వయకర్త రాజా సుందర్, అధికారులు, నాయకులు పాల్గొన్నారు. అడ్డగుట్ట ఏ. బీ. సీ. డీ. సేక్షన్లు, సుబాష్ విగ్రహం, తుకారాం గెట్, తదితర ప్రాంతాల్లో పద్మారావు గౌడ్ ఈ సందర్భంగా పర్యటించారు. రూ. 450 లక్షల ఖర్చుతో మల్టీ పర్పస్ ఫంక్షన్ హాల్ అదనపు భవన సముదాయం నిర్మాణం పనులతో పాటు సుమారు రూ. 118 లక్షల ఖర్చుతో నిర్మిస్తున్న సీ. సీ. రోడ్డు నిర్మాణం పనులు, బీ. సెక్షన్ లో మెట్ల నిర్మాణం పనులను పద్మారావు గౌడ్ ఈ సందర్భంగా ప్రారంభించారు.
