డిగ్రీ అధ్యాపక పోస్టులకు కాంగ్రెస్ బిగించిన ఉచ్చు – భర్తీలో కొత్త రూల్స్

డిగ్రీ అధ్యాపక పోస్టులకు కాంగ్రెస్ బిగించిన ఉచ్చు – భర్తీలో కొత్త రూల్స్*

 

ఆర్.బి.ఎం : డిగ్రీ అధ్యాపక పోస్టుల భర్తీ కోసం గత 15 సంవత్సరాలుగా పీజీలు చదివి ఎంతోమంది కేంద్రస్థాయిలో యుజిసి నిర్వహించే అర్హత పరీక్ష నెట్లో కూడా అర్హులై లక్షల మంది నిరుద్యోగులు డిగ్రీ లెక్చరర్ నోటిఫికేషన్ కోసం కండ్లు కాయలు కాసే విధంగా ఎదురుచూస్తున్నారు .అయితే గత బిఆర్ఎస్ ప్రభుత్వం 31 డిసెంబర్ 2022 న 544 ఖాళీలతో డిగ్రీ లెక్చరర్ నోటిఫికేషన్ ను విడుదల చేసింది.

 

కానీ అప్పటి కొంతమంది జూనియర్ లెక్చరర్లు మాకు కూడా అవకాశం ఇవ్వాలని కోరగా టిఆర్ఎస్ ప్రభుత్వం అందుకుగాను టీజీ సెట్ ను నిర్వహించారు. టిజిసెట్ నిర్వహించి ఫలితాలు విడుదల అయ్యే సమయానికి చాలా ఆలస్యమై ఒక సంవత్సరం గడిచిపోయింది. 2023లో ఎన్నికల షెడ్యూల్ రానే వచ్చింది అప్పటికే అప్లికేషన్ తీసుకోవాల్సిన డిగ్రీ లెక్చరర్ నోటిఫికేషన్ వాయిదా పడింది 2022లో విడుదలైన నోటిఫికేషన్ కి ఇప్పటిదాకా భర్తీ చేసే మార్గమే ఇప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వానికి దొరకలేదేమో. 3 వేలకు పైగా పోస్టులు ఖాళీలు ఉన్నప్పటికీ 2022లో 544 పోస్టుల వివరాలు ఉంటే దానికి అదనంగా 3000 పోస్టులు పెంచి ఇవ్వొచ్చు కానీ 2026 సంవత్సరం కూడా వచ్చింది కానీ మూడు సంవత్సరాలు దాటిన ఈ నోటిఫికేషన్ జాడే లేదు. ఈ మూడు సంవత్సరాల్లో ఇయర్ క్యాలెండర్ మారింది కానీ జాబ్ క్యాలెండర్ మాత్రం లేదు.

 

ఇవన్నీ ఇలా ఉండంగా ఈ పరీక్షకు అర్హత విషయానికి వస్తే యూజీసీ నిర్వహించే నెట్ తెలంగాణ రాష్ట్రం నిర్వహించే టిజిసెట్లు అర్హతలుగా ఉన్నాయి. అలాగే పిజీలో 50% మార్కులు తప్పనిసరి కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ మాత్రం నిరుద్యోగుల పొట్ట కొట్టే ప్రయత్నం చేస్తుంది . ఈ అర్హతలు సరిపోవు అన్నట్లు సరికొత్తగా G.O .NO.4 ను తీసుకొచ్చి కష్టపడి చదువుకున్న వారి స్వప్నం ను చెదిరేసే ప్రయత్నం చేస్తుంది. ఈ జీవో నెంబర్ 4 వల్ల ఎంతోమంది నష్టపోయే అవకాశం ఉంది. ఈ జీవో నెంబర్ 4 వలన కొంతమంది పెద్ద కుటుంబాలకు ,రాజకీయ స్నేహితులకే లాభం తప్ప నిరుపేద విద్యార్థికి ఒరిగేదేం లేదు. నెట్ , సెట్ అర్హతలు సాధించిన వారికే అర్హతలు ఉన్న పరీక్షకి కొత్తగా ఇన్ని రోజులు అవసరమా? ఒకవేళ ఈ రూల్స్ వర్తించాలంటే జరగాల్సిన మార్పులు ఎందుకు జరగలేదు.

 

జీవో నంబర్ 4 లో కొత్త రూల్స్ లు ఏమంటే అకాడమిక్ స్కోరు కి 50 మార్కులు ,

రాతపరీక్షకి 40 మార్కులు,

ఇంటర్వ్యూకి 10 మార్కులు

మొత్తం 100 మార్కులు ఇందులో అకాడమీ స్కోరు అంటే పీహెచ్డీకి 20 మార్కులు, జేఆర్ఎఫ్ సాధించిన వారికి 10 మార్కులు ,m. phil కి 10 మార్కులు ఇలా మొత్తం 50 మార్కులు ఇలా డివైడ్ చేసి మొత్తం 50 మార్కుల కేటాయించారు .

 

ఒకప్పుడు వంద మార్కులు రాత పరీక్ష ద్వారానే నిర్వహించేవారు .ఇప్పుడు కొత్తగా ఏ రూల్స్ పెట్టడం ఏమైనా న్యాయమేనా ?మరి పీహెచ్డీకి అంత విలువని ఇచ్చేవారు ఇన్ని మార్కులు కేటాయించిన వారు రాష్ట్రంలో అన్ని యూనివర్సిటీలో పిఎస్డి నోటిఫికేషన్లు పోస్టులు పెంచే ప్రతి సంవత్సరం ఎందుకు విడుదల చేయడం లేదు ?M.phil కూడా రద్దయింది. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో M.phil కోర్సు లేనేలేదు. JRF అంటారా అది అందరిని ద్రాక్షనే.

 

ఇలా కొత్త విధానాల ద్వారా ఎవరికి లాభం ఈరోజు కాంట్రాక్ట్ లో పని చేస్తున్న వారి కోసమా, లేక రాజకీయ సుపరిచితుల కోసమా, లేక లోలోపలే గుట్టు సప్పుడు కాకుండా ఈ 50 మార్కులని అడ్డం పెట్టుకొని పోస్టులన్నీ అమ్ముకోడానికా? మిగతా 40 మార్కులు రాత పరీక్ష అది అందరికీ సమానమే అందులో ఎలాంటి సందేహాలకు తావు లేదు. ఇక ఇంటర్వ్యూ సంగతి చెప్పనక్కర్లేదు. దేనికి దీనికి 10 మార్కులు గ్రూప్ వన్ స్థాయికే లేని ఇంటర్వ్యూ డిగ్రీ స్థాయి లెక్చరర్స్ కి ఎందుకు .

 

ఎందుకంటే అక్కడ కూడా రాజకీయం చేసి మీకు కావాల్సినవారికి, మీరూ ఉద్యోగాలు అమ్ముకున్న వారికి మీరు ఉద్యోగాలు అమ్ముకున్న వారికి మాత్రమే ,మోకాలు చూసి బొట్లు పెట్టి ఉద్యోగాలు ఇస్తారు .ఇక్కడ ఈ దొంగ జీవో నెంబర్ నాలుగుని పుట్టించడానికి ప్రధాన కారణం ఉద్యోగాలు అమ్మడం కోసమే .

 

డబ్బున్నోళ్లు డిగ్రీ లెక్చరర్ ఉద్యోగం కొనుక్కుంటారు. ఇక్కడ చదివిన వారి పరిస్థితి ఏంటి? వారి ఎదురుచూపులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన బహుమతి ఇదేనా ?15 సంవత్సరాల కలగానే మిగిలిపోనుందా? ఇక ఈ డిగ్రీలు ఎందుకు ?పట్టాలెందుకు? కాబట్టే ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలి. టీజీపీఎస్సీ బోర్డు కూడా ఈ నిబంధనలతో కూడిన జీవో నెంబర్ నాలుగుని రద్దు చేయాలని కోరుకుంటున్నాం. లేకపోతే తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమం ఎగిసే అవకాశం ఉంటుంది.

అస్మా

(తెలంగాణ డిగ్రీ లెక్చరర్ నిరుద్యోగుల సంఘం )

7286832747

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *