ప్రజలను బానిసలుగా మార్చిన ప్రభుత్వం: ఈటల
ఆర్.బి.ఎం హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రజలను మద్యానికి బానిసలు చేసిందని ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఆరోపించారు. మద్యం అమ్మకాల ద్వారా ఏడాదికి రూ.37 వేల కోట్ల ఆదాయం వస్తుందని తెలిపారు. కేంద్రం ధాన్యం కొనాలని రాష్ట్ర ప్రభుత్వం రాజకీయం చేస్తుందని, రైతులు సాగుచేసిన కొద్దిపాటి వరి పంటకు కూడా విద్యుత్ కోతలు విధిస్తున్నారని ఆరోపించారు. హుజూరాబాద్‌లో తనను ఓడించాలని సీఎం కేసీఆర్ కోటాను కోట్ల రూపాయలు ఖర్చు చేసినా.. ప్రజల అభిమానంతో గెలిచానని తెలిపారు. ఎప్పుడైనా ప్రజల పక్షాన ఉండి పోరాడుతానని రాజేందర్ ప్రకటించారు. అన్ని కులాలు ఏకం కావాలన్నారు. మద్యం నుంచి వచ్చిన రాబడితోనే ప్రభుత్వ పథకాలు కొనసాగుతున్నాయని రాజేందర్ తెలిపారు.
