50 ఏళ్లలో జరగని అభివృద్ధి పదేళ్లలో చేసి చూపించాం
◆ మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్
ఆర్.బి.ఎం, సికింద్రాబాద్: సికింద్రాబాద్ నియోజకవర్గానికి సంబంధించిన ఎనిమిది మున్సిపల్ వార్డులను సమానంగా అభివృద్ది చేస్తున్నామని, తమ పార్టీ కి చెందిన కార్పొరేటర్లు కూడా అభివృద్ది పనుల్లో పోటీ పడుతున్నారని సికింద్రాబాద్ శాసనసభ్యులు, మాజీ డిప్యూటీ స్పీకర్ తీగుళ్ళ పద్మారావు గౌడ్ అన్నారు. సీతాఫలమండీ మున్సిపల్ డివిజన్ పరిధిలో గురువారం పద్మారావు గౌడ్ విస్తృతంగా పర్యటించారు. రు.97 లక్షల ఖర్చుతో వివిధ బస్తీలు, కాలనీల్లో సీ. సీ. రోడ్డు నిర్మాణం పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సికింద్రాబాద్ ను సమస్యల రహిత ప్రాంతంగా తీర్చిదిద్దామని తెలిపారు. 50 సంవత్సరాలలో చేపట్టని పనులను గత పదేళ్ళలో పూర్తి చేశామని తెలిపారు. కార్పొరేటర్ సామాల హేమ, అధికారులు సువర్ణ లత, మాధవి, విద్యా సాగర్, వేణు, కుశల్ , శ్రీకాంత్, యువ నేత రామేశ్వర గౌడ్, సమన్వయకర్త రాజా సుందర్, అధికారులు, నాయకులు పాల్గొన్నారు. బ్యాంక్ కాలనీ, సీతారామ నగర్, మేడి బావి, రామాలయం, బీదల బస్తీ, టీ. ఆర్. టీ. క్వార్టర్స్ తదితర ప్రాంతాల్లో పద్మారావు గౌడ్ ఈ సందర్భంగా పాద యాత్ర నిర్వహించారు.
