మోడల్ గా నిలిచేలా ఈద్గా, కబరాస్తా న్ లు
ఇది కద నిజం,సికింద్రాబాద్ : సికింద్రాబాద్ నియోజకవర్గం పరిధిలోని ఈద్గా, కబరాస్తాన్ లను వివిధ సదుపాయాలతో అభివృద్ది చేశామని సికింద్రాబాద్ శాసనసభ్యులు, మాజీ డిప్యూటీ స్పీకర్ తీగుళ్ళ పద్మారావు గౌడ్ అన్నారు. చిలకలగూడా కబరాస్తా న్ ను పద్మారావు గౌడ్ గురువారం సందర్శించి, రానున్న రోజుల్లో చేపట్టాల్సిన అభివృద్ది పనుల పై అధికారులతో సమీక్షించారు. కార్పొరేటర్ సామాల హేమ, జీ. హెచ్. ఏం. సీ. ఇంజనీరింగ్ అధికారులు మాధవి, వేణు, శ్రీనివాస్, మైనారిటీ నేతలు జహాంగీర్ భాయి, ఘౌస్, కాలీమ్ చిచ్చ , మున్నా భాయి, సమన్వయకర్త రాజా సుందర్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రతీ ఏటా వివిధ పర్వ దినాల సందర్భాలలో ప్రత్యేక ప్రార్ధనలు నిర్వహించేందుకు పెద్ద సంఖ్యలో పౌరులు తరలి రానున్నoదున తగిన ఏర్పాట్లు, సదుపాయాలను కల్పించాలని పద్మారావు గౌడ్ ఈ సందర్భంగా అధికారులను ఆదేశించారు.
