దిగివచ్చిన ‘శక్తి’ కంపెనీ.. కొత్త యంత్రాల పంపిణీ!

దిగివచ్చిన ‘శక్తి’ కంపెనీ.. కొత్త యంత్రాల పంపిణీ!

● “*ఎమ్మెల్యే కాలే యాదయ్య చొరవతో రైతులకు న్యాయం!*

● *రోటవేటర్లు విరిగిపోయిన 24 గంటల్లోనే సమస్య ఎమ్మెల్యే దృష్టికి*

ఆర్.బి.ఎం,నవాబుపేట: నవాబుపేట మండల కేంద్రంలో రైతులకు పంపిణీ చేసిన సబ్సిడీ రోటవేటర్ల వ్యవహారం సుఖాంతమైంది. ఈ నెల 23న ఎమ్మెల్యే కాలే యాదయ్య, మండల వ్యవసాయ అధికారి (ఏవో) చేతుల మీదుగా ‘శక్తి’ కంపెనీకి చెందిన రోటవేటర్లను రైతులకు పంపిణీ చేశారు. అయితే, పంపిణీ చేసిన కేవలం 24 గంటల వ్యవధిలోనే అవి విరిగిపోవడంతో రైతులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. నాణ్యత లేని యంత్రాల వల్ల తమకు నష్టం వాటిల్లుతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే కాలే యాదయ్య వెంటనే స్పందించారు. రైతులకు జరుగుతున్న నష్టాన్ని గమనించి, శక్తి కంపెనీ యాజమాన్యంతో స్వయంగా మాట్లాడారు. యంత్రాల నాణ్యత లోపంపై వారికి పూర్తి వివరాలను వివరించి, రైతులకు తక్షణమే న్యాయం చేయాలని కోరారు. ఎమ్మెల్యే చొరవతో దిగివచ్చిన కంపెనీ యాజమాన్యం, విరిగిపోయిన రోటవేటర్ల స్థానంలో కొత్తవి పంపేందుకు అంగీకరించింది. తాజాగా, నవాబుపేట ఏవో సమక్షంలో విరిగిపోయిన రోటవేటర్ల స్థానంలో కొత్త యంత్రాలను రైతులకు అందజేశారు. తమ సమస్యపై తక్షణమే స్పందించి కంపెనీతో మాట్లాడి కొత్త రోటవేటర్లు వచ్చేలా కృషి చేసిన ఎమ్మెల్యే కాలే యాదయ్యకు, అలాగే కొత్త యంత్రాలను అందించిన శక్తి కంపెనీ యాజమాన్యానికి రైతులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *