కేసీఆర్ కు సిట్ నోటీసులు జారీ చేయడం సరికాదు
ఇది కద నిజం,సికింద్రాబాద్ : తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కే సీ ఆర్ కు సిట్ నోటీసులు జారీ చేయడం సరికాదని కక్ష సాధింపు చర్యలకు పాల్పడడం శోచనీయమని సికింద్రాబాద్ శాసనసభ్యులు, మాజీ డిప్యూటీ స్పీకర్ తీగుళ్ళ పద్మారావు గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం ఆయన సీతాఫలమండీ లో మీడియా తో మాట్లాడుతూ ప్రజల ఆకాంక్షలకు విరుద్దంగా పాలనను సాగిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల దృష్టిని మళ్లించేందుకు నోటీసులు జారీ చేస్తోందని విమర్శించారు. ప్రజలకు అందించిన హామీలను పాలకులు విస్మరించారని, ప్రజాగ్రహం నుంచి దృష్టిని మళ్లించేందుకు కొత్త వ్యూహాలు వెతుకుతున్నారని ఆరోపించారు. గతంలో తాము పాలనలో ఉన్నామని, కుట్ర పూరితంగా, కక్షలు సాదించేలా రాజకీయాలు చేయలేదని స్పస్టం చేశారు. మళ్ళీ తమ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని పద్మారావు గౌడ్ ధీమా వ్యక్తం చేశారు. ఎన్ని కుట్రలు కుతంత్రలు చేసినా, కక్ష పూరితంగా వ్యవహరించినా ధైర్యంగా ఎదుర్కొంటామని పేర్కొన్నారు.
