మున్సిపల్ బరిలో ‘జాగృతి’ సత్తా.. ఫార్వర్డ్ బ్లాక్ పార్టీతో కలిసి ప్రయాణం!

ఆర్.బి.ఎం : మున్సిపల్ ఎన్నికల్లో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ సింహం గుర్తుపై తెలంగాణ జాగృతి ఔత్సాహిక అభ్యర్థుల పోటీ. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సమక్షంలో ప్రకటించిన ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ తెలంగాణ రాష్ట్ర చైర్మన్ జావెద్ లతీఫ్, ఉపాధ్యక్షులు కె.బుచ్చిరెడ్డి. తెలంగాణ జాగృతి, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ నేతల చర్చలు.. మున్సిపల్ ఎన్నికలతో పాటు భవిష్యత్ లోనూ కలిసి పని చేయాలని నిర్ణయం.బుధవారం సాయంత్రం ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ కార్యాలయంలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితతో ఏఐఎఫ్ బీ రాష్ట్ర చైర్మన్ జావెద్ లతీఫ్, కన్వీనర్ జోజిరెడ్డి, ఉపాధ్యక్షుడు బుచ్చిరెడ్డి, సెంట్రల్ కమిటీ సభ్యులు ఆర్ వీఆర్ ప్రసాద్, తేజ్ దీప్ రెడ్డి, కొండ దయానంద్, ప్రధాన కార్యదర్శి కోమటిరెడ్డి తేజ్ దీప్ రెడ్డి, ఫైనాన్స్ సెక్రటరీ కె. నరేందర్, నిజామాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి రాజు గౌడ్, సిద్దిపేట జిల్లా ప్రధాన కార్యదర్శి బీరన్న, నల్గొండ ప్రధాన కార్యదర్శి రాము, ఐవైఎల్ స్టేట్ ప్రెసిడెంట్ ఆదిత్య, జనరల్ సెక్రటరీ కృష్ణమూర్తి సహా ముఖ్య నేతల సమావేశం
