కొండా లక్ష్మణ్ బాపూజీకి ఘనంగా నివాళులు అర్పించిన స్పోర్ట్స్ అథారిటీ

  • తెలంగాణే శ్వాసగా బతికిన కొండా లక్ష్మణ్ బాపూజీ
  • రాష్ట్ర సాధనకు బాటలు వేసిన బాపూజీ
  • కొండా లక్ష్మణ్ బాపూజీకి ఘనంగా నివాళులు అర్పించిన స్పోర్ట్స్ అథారిటీ

ప్రముఖ స్వాతంత్ర్య సమర యోధుడుతెలంగాణ సాధన ఉద్యమ యోధుడు *దివంగత నేత ఆచార్య శ్రీ కొండా లక్ష్మణ్ బాపూజీగారి 110వ జయంతి వేడుకలు స్పోర్ట్స్ అథారిటీ కార్యాలయం ఎల్బీ స్టేడియంలో చైర్మన్ శివసేన రెడ్డి గారి ఆధ్వర్యంలో జయంతి కార్యక్రమం నిర్వహించడమైనది.

సీఎం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలోనే తెలంగాణ ఉద్యమకారులకు నిజమైన గుర్తింపు లభిస్తోందని,తెలంగాణ కోసం కృషి చేసిన ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ లాంటి ప్రతి ఒక్క త్యాగదనులను భవిష్యత్తు తరాలు గుర్తుంచుకునేలా
ఈరోజు రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఘనంగా నిర్వహించడం జరుగుతుందని అన్నారు
ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ (1915–2012) తెలంగాణా రాష్ట్ర ఆవిర్భావ పోరాటంలో కీలక నాయకులలో ఒకరని, ఆదిలాబాద్ జిల్లాలోని వాంకిడి గ్రామంలో 27 సెప్టెంబర్ 1915న జన్మించిన స్వాతంత్ర్య సమరయోధుడు, సామాజిక న్యాయ పోరాట యోధుడని చైర్మన్ శివసేన రెడ్డి అన్నారు.
తెలంగాణా ప్రత్యేక రాష్ట్రం కోసం మొదటి నుంచే నిరంతరంగా శ్రమించారని తెలంగాణ కోసం తన మంత్రి పదవిని త్యాగం చేసి ఆ తర్వాత పది ఏ పదవి చేపట్టని త్యాగధనుడని అన్నారు.

2001లో తెలంగాణా రాష్ట్రం సాధ్యం కావడానికి ముందు ఆయనే ఒక లక్ష్యంగా మారి, చివరి వరకు తెలంగాణా రాష్ట్ర సాధనయే శ్వాసగా బ్రతికారని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్పోర్ట్స్ అథారిటీ అధికారులు కోచులు సిబ్బంది పలువురు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *