ఓయూ డాక్టరేట్ పొందిన స్పోర్ట్స్ అథారిటీ ఎండి
సోనీ బాలాదేవికి పలువురి అభినందనలు
RBM: తెలంగాణ ప్రాధికార సంస్థ వైస్ ఛైర్మెన్ మేనేజింగ్& డైరెక్టర్ శ్రీమతి ఏ సోనీ బాలాదేవి ప్రతిష్టాత్మక ఉస్మానియా యూనివర్సిటీ నుండి డాక్టరేట్ పట్టా పొందింది.ఉస్మానియా విశ్వవిద్యాలయం డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ బాటనీ విభాగంలో
తెలంగాణ రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుండి సేకరించిన జిమ్నీమా సిల్వెస్ట్రే (Gymnema sylvestre (Retz) R. Br. ex Sm) లోని ఫైటోకెమికల్ సమ్మేళనాల పెరుగుదలలో ట్రైకోడెర్మా (Trichoderma spp.) ప్రభావిత్వంపై అధ్యయనాలు అన్న అంశంపై ఆమె పరిశోధనా పత్రానికి యూనివర్సిటీ డాక్టర్ రేట్ తో సత్కరించింది.
తెలంగాణ రాష్ట్ర గవర్నర్, యూనివర్సిటీ ఛాన్స్లర్ జిష్ణు దేవా శర్మ మరియు ఉస్మానియా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ఎం కుమార్ ల చేతుల మీదుగా ఈ డాక్టరేట్ పట్టా ప్రధానం జరిగింది
*అభినందించిన క్రీడామంత్రి*
, క్రీడలు మరియు యువజన సేవల శాఖ మంత్రివర్యులు శ్రీ వాకిటి శ్రీహరి,తెలంగాణ రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ ఛైర్మన్ శ్రీ శివసేన రెడ్డి , డాక్టర్ సోనిబాలా దేవికి హృదయపూర్వక అభినందనలు తెలిపారు.
తెలంగాణ రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ ఉద్యోగులు సిబ్బంది కోర్సులు అధికారులు డాక్టర్ సోనిబాలా దేవి గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసారు.
