స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న పద్మారావు గౌడ్
సికింద్రాబాద్, ఆగష్టు 15 :సికింద్రాబాద్ శాసనసభ్యులు, మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ సితాఫలమండీ లోని ఎం.ఎల్.ఏ. క్యాంపు కార్యాలయంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పద్మారావు గౌడ్ ప్రసంగిస్తూ వివిధ రంగాల్లో సాధించిన పురోగతి, చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను విపులీకరించారు. పేద, బడుగు, బలహీన వర్గాలకు అన్ని రకాలుగా న్యాయం చేకుర్చినప్పుడే స్వాత్రంత్ర ఫలాలు సమానంగా దక్కుతాయని అన్నారు. కార్పొరేటర్లు సామల హేమ, కంది శైలజ, యువ నేత రామేశ్వర్ గౌడ్, పెద్ద సంఖ్యలో స్కూల్ విద్యార్ధులు , నాయకులు, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పద్మారావు గౌడ్ స్వీట్లు పంచారు. అంతకు ముందు మోండా మార్కెట్ లోని తన నివాసంలో పద్మారావు గౌడ్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.

