ప్రభాస్ ఫాన్స్ కు గుడ్ న్యూస్
ఆర్.బి.ఎం డెస్క్ హైదరాబాద్: ప్రముఖ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అప్ కమింగ్ సినిమాలో స్పిరిట్ ఒక్కటి. ఈ సినిమాను సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ వంగ తెరకెక్కిస్తున్న విషయం విదితమే. కాగా ఈ మూవీ కి సంబంధిచిన కొన్ని అప్ డేట్స్ సందీప్ వంగ లీక్ చేశారు. విజయ దేవరకొండ హీరోగా తెరకెక్కుతున్న కింగ్డమ్ మూవీ ప్రమోషన్ లో పాల్గొన్న సందీప్ వంగ స్పిరిట్ మూవీ వచ్చే సెప్టెంబర్ నెలలో ప్రారంభం ఆవుతుందని, షూటింగ్ మొదలుపెట్టి నాన్ స్టాప్ గా సినిమా చిత్రీకించి పూర్తి చేసే యోచనలో సందీప్ రెడ్డి వంగ ఉన్నటు సమాచారం. ప్రస్తుతం ప్రభాస్ రెండు సినిమా షూటింగ్ లలో బిజిగా ఉన్నారు. అయన చేస్తున్న రెండు సినిమాలో ఒక్కటి రాజా సాబ్ షూటింగ్ చివరి దశలో ఉండగా రెండో సినిమా ఫౌజి సినిమా కూడా దాదాపుగా సగానికి పైగా పూర్తయింది. ఈ రెండు సినిమా షోట్టింగ్లు త్వరగా ముగించుకొని వెంటనే స్పిరిట్ మూవీ మొదలు పెడతారని తెలుస్తుంది. స్పిరిట్ మూవీకి సంబంధించిన స్క్రిప్ట్ మొత్తం సందీప్ వంగ పూర్తి చేశారు. స్పిరిట్ మూవీ కోసం ప్రభాస్ 90 రోజులు సందీప్ రెడ్డికి ఇచ్చారు. కాగా ఈ సినిమా 2026 లో ప్రేక్షకుల ముందుకు రానున్నట్టు సమాచారం.. ఈ సినిమాలు ప్రభాస్ ఓక పోలీస్ ఆఫీసర్ గా చేయనున్నారు, ప్రభాస్ సరసన ఇద్దరు తరమణిలు నటించబోతున్నారు.
