రోశయ్య సేవలు మరువలేనివి:తెలంగాణస్పోర్ట్స్ అథారిటీ ఘనంగా నివాళులు
దివంగత ముఖ్యమంత్రి రోశయ్య గారు సమాజానికి చేసిన సేవలు మరువలేనివని తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి అన్నారు.
స్వర్గీయ ముఖ్యమంత్రి రోశయ్య గారి 92వ జయంతి సందర్భంగా ఈరోజు ఈరోజు ఎల్బీ స్టేడియంలో
ఆయన చిత్రపటానికి పూలమాల లేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా, వివిధ శాఖలకు మంత్రిగా
రోశయ్య గారు చేసిన సేవలు చిరస్మరణీయమని అన్నారు.
నమ్మిన సిద్ధాంతం కొరకు చివరి శ్వాస వరకు కట్టుబడి ఉన్న రోశయ్య గారి జీవితం వర్తమానం రాజకీయ నాయకులకు ఆదర్శమని అన్నారు.పార్టీలకతీతంగా ఆయనకు అన్ని పార్టీల్లో అభిమానులు ఉన్నారని
అన్ని రకాల సిద్ధాంతాల వారు ఆయనను అభిమానిస్తారని ఆయన అన్నారు.అన్ని శాఖలపై ఆయనకు ఉన్నపట్టు, విషయ పరిజ్ఞానం రాష్ట్రానికి క్లిష్ట పరిస్థితిలో ఉపయోగపడిందని అన్నారు.
దివంగత రోశయ్య గారి జయంతి వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహించడము ఎంతో సంతోషకరమని అన్నారు. ఈ కార్యక్రమంలో మేనేజింగ్ డైరెక్టర్ శ్రీమతి సోనీ బాలాదేవి డిప్యూటీ డైరెక్టర్లు చంద్రారెడ్డి రవీందర్, అనిత, అసిస్టెంట్ డైరెక్టర్ కళ్యాణి కె.వి భట్టార్, పిఆర్ఓ కాలేరు సురేష్ తదితరులు పాల్గొన్నారు
