సందడిగా పూర్వ విద్యార్థుల సమ్మేళనం

పాతికేళ్ల తర్వాత మళ్లీ కలిశారు స్నేహితులను కలుసుకునేందుకు విదేశాల నుంచి వచ్చారు.

హైదరాబాద్: కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని ఆదర్శ్ నగర్ లో ఉన్న గాయత్రి గ్రామర్ హైస్కూల్, 1999-2000 టెన్త్ క్లాస్ బ్యాచ్ విద్యార్ధులు సిల్వర్ జూబ్లీ వేడుకలు చేసుకున్నారు. బంజారా హిల్స్, తాజ్ డెక్కన్ హోటల్ లో జరిగిన ఈ వేడుకలకు పలువురు పూర్వ విద్యార్థులు విదేశాల నుంచి వచ్చారు. పాతికేళ్ల తర్వాత కలుసుకోవడంతో వారంతా ఉబ్బితబ్బిబ్బయ్యారు. ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకున్నారు. క్షేమ సమాచారాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు మాట్లాడుతూ విలువలతో జీవించాలని, భవిష్యత్ తరాలకు స్పూర్తినిచ్చేలా బతకాలని కోరారు. సందడిగా సాగిన ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్, కరెస్పాండెంట్ అలివేలు మంగతాయారుతో పాటు ఉపాధ్యాయులను విద్యార్థులు సత్కరించారు. గురువులు అందించిన విద్యవల్లే తామంతా ఉన్నత స్థితులకు చేరుకున్నామంటూ పూర్వ విద్యార్థులు ధన్యవాదాలు తెలిపారు.1999- 2000 సంవత్సరంలో తమకు ఆయాగా సేవలందించిన మహిళకు నగదు బహుమతి ఇచ్చారు. కార్యక్రమంలో 65 మంది పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *