ట్రాఫిక్ వాహనాలను తనిఖీ చేసిన ఆర్ఎస్ఐ మధుకర్
ఆర్.బి.ఎం: పెద్దపల్లి జిల్లా రామగుండం కమిషనరేట్ పరిధి లో ఉన్న రామగుండం ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న వాహనాలను మోటారు ట్రాన్స్ పోర్ట్ అధికారి మధుకర్ (RI) ఈరోజు తనిఖీ చేశారు. ప్రతి నెల ప్రైవేట్ మరియు ప్రభుత్వ వాహనాలు నడుపుతున్న డ్రైవర్లకు మెయింటెనెన్స్ గురించి వివరించారు. ఎప్పటికప్పుడు వాహనాలను పరిశీలించుకోవాలని సీట్ బెల్ట్ తప్పనిసరి పెట్టుకొని వాహనాలు నడపాలని సూచించారు. ఈ తనిఖీలో భాగంగా రామగుండం స్టేషన్ ట్రాఫిక్ CI కొండపాక ప్రవీణ్ కుమార్, SI నాగరాజు, ASI వెంకటేశ్వర్ బాబు, సిబ్బంది బాయ్ శ్రీనివాస్, లక్ష్మణ్, వసీం, అక్రమ్, ప్రవీణ్ కుమార్ పాల్గొన్నారు
