వేలిముద్రలు సరిగా రాని పెద్దమనుషులకు కార్యదర్శులు వేలిముద్రలు పెట్టి పింక్షన్ లు ఇప్పించాలి: డాక్టర్ మెతుకు ఆనంద్, వికారాబాద్ ఎమ్మెల్యే
ఆర్.బి.ఎం: ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ “మీతో నేను” కార్యక్రమంలో భాగంగా ధారూర్ మండల పరిధిలోని శేరిగడ్డ తండా, జీడిగడ్డ తండా మరియు PCM తండాలలో పర్యటించారు.
గ్రామాల్లో వేలిముద్రలు (THUMB) సరిగా రాని పెద్దమనుషులకు పంచాయతీ కార్యదర్శులు వేలిముద్రలు పెట్టి పింక్షన్ లు ఇప్పించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. తండాల వాసులందరికి గురుదోట్ల గ్రామంలో రేషన్ బియ్యం ఇవ్వడం జరుగుతుందని ఇబ్బందిగా ఉందని ప్రజలు తెలుపగా … ఎమ్మెల్యే మూడు తండాల వాసులందరికీ PCM తండాలోనే ప్రజలకు రేషన్ బియ్యం పంపిణీ చేయాలని ఆదేశించారు. PCM తండా లో నూతన మిషన్ భగీరథ వాటర్ ట్యాంక్ మంజూరు చేయడం జరిగిందని, త్వరలో నిర్మాణ పనులను పూర్తిచేసుకొని వాడుకలోకి తీసుకొద్దామన్నారు.
తండాలలో నివాస ఆవరణలో పెంట కుప్పలు తీసివేసి ఊరి బయటకు మార్చాలని పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. గ్రామంలో నీరు రోడ్లపై పారడంతో మురుగు కాలువలు మరియు సీసీ రోడ్ల నిర్మాణానికి కృషి చేద్దామన్నారు. గ్రామంలో థర్డ్ వైర్ ఏర్పాటు చేయాలని, అవసరమైన వీధులలో కొత్త స్తంభాలు ఏర్పాటు చేసి, పాత స్థంబాలను తొలగించి గ్రామంలో మరియు పంటపొలాల్లో వేలాడుతున్న విద్యుత్ తీగలను సరిచేయాలని, ఎలాంటి అంతరాయాలు లేకుండా విద్యుత్ సరఫరా చేయాలని అధికారులను ఆదేశించారు. మిషన్ భగీరథ మంచినీటి నల్లా కనెక్షన్ ప్రతీ ఇంటికి కచ్చితంగా ఇవ్వాలని, లీకేజీలు లేకుండా వాటర్ ట్యాంక్ ను నెలకు మూడు సార్లు శుభ్రం చేస్తూ… ఎప్పటికప్పుడు పరిశీలన చేస్తూ… సురక్షిత మంచినీటి సరఫరా చేయాలని ఆదేశించారు, ప్రజలు సురక్షితమైన మిషన్ భగీరథ మంచి నీటిని త్రాగాలని అందుకు ప్రజలకు అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు.
ప్రతి ఇంటి వద్ద ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకోవాలని మరియు కచ్చితంగా మరుగుదొడ్లు నిర్మించుకొని వాడుకలో పెట్టాలని ప్రజలకు సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, పార్టీ నాయకులు కార్యకర్తలు గ్రామస్తులు మరియు తదితరులు పాల్గొన్నారు.
