నా కుటుంబ సభ్యులు కంట్రోల్ బియ్యం తింటున్నారు: రాజయ్య,ఎమ్మెల్యే
ఆర్.బి.ఎం వరంగల్: తమది పేద కుటుంబమని తాను కింది స్థాయి నుంచి ఎదిగానని ఎమ్మెల్యే రాజయ్య తెలిపారు. ఇప్పటికీ తన చెల్లెళ్లు కంట్రోల్ బియ్యం తింటున్నారని చెప్పారు. అంబేద్కర్ కల్పించిన రిజర్వేషన్లను వంద శాతం వాడుకొని తాను డాక్టర్‌గా, ఉప ముఖ్యమంత్రిగా ఎదిగానని వెల్లడించారు. తన కుమారులు, కోడళ్లు డాక్టర్లు అయ్యారని తెలిపారు. తన చెల్లెళ్లకు నేటికీ సొంత ఇండ్లు లేవని, వారి కుటుంబాలు నేటికీ బీదరికంలోనే ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. దళితులందరూ తన కుటుంబ సభ్యులేనని రాజయ్య తెలిపారు. జైశ్రీరామ్ అంటే దళితులు బాగుపడరని, జై దళితబంధు అంటే బాగుపడతారని రాజయ్య పేర్కొన్నారు.
