రామకృష్ణ మఠంలో ఘనంగా స్వామి రంగనాథానంద జయంతి వేడుకలు

రామకృష్ణ మఠంలో ఘనంగా స్వామి రంగనాథానంద జయంతి వేడుకలు

హైదరాబాద్: భారతీయ సంస్కృతి అతి ప్రాచీనమైనదే కాక నిత్యనూతనమైనదని , ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్స్ అధ్యక్షుడు డా. వినయ్ సహస్రబుద్ధే చెప్పారు. హైదరాబాద్ రామకృష్ణ మఠంలో స్వామి రంగనాథానంద 116 వ జయంతి ఉత్సవాలలో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొని ‘ఇండియన్ కల్చర్ అండ్ ఇట్స్ సాఫ్ట్ పవర్ స్ట్రెంత్ అంశం పై ప్రసంగించారు. సర్వ మానవ, సర్వ ప్రాణకోటి శ్రేయస్సు కోరుకునే భారత్ అనాదిగా విశ్వానికి మిత్రుడిలా ఉందన్నారు. యోగ, ఆయుర్వేదం, ఆధ్యాత్మికం అనేవి భారత్ ప్రపంచానికి అందించిన వరాలు అని ఆయన చెప్పారు. హైదరాబాద్ రామకృష్ణ మఠం తొలి అధ్యక్షుడిగా, రామకృష్ణ మఠం, మిషన్ 13వ సర్వాధ్యక్షుడిగా స్వామి రంగనాథానంద తన పనితీరు, వ్యక్తిత్వంతో లక్షలాది మందికి స్ఫూర్తినివ్వడమే గాక రామకృష్ణ మఠం చరిత్రలో శాశ్వత ముద్ర వేశారని హైదరాబాద్ రామకృష్ణ మఠం అధ్యక్షుడు స్వామి బోధమయానంద చెప్పారు. కార్యక్రమంలో దేశం నలుమూలల నుంచి వచ్చిన రామకృష్ణ మఠం వివిధ శాఖల స్వాములు, భక్తులు, వాలంటీర్లు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *