యుద్ధప్రాతిపదికన వాక్సిన్ పంపిణీ: పద్మారావు గౌడ్,డిప్యూటీ స్పీకర్

యుద్ధప్రాతిపదికన వాక్సిన్ పంపిణీ: పద్మారావు గౌడ్,డిప్యూటీ స్పీకర్

ఆర్.బి.ఎం డెస్క్: సూపర్ స్పైడర్స్ కు ప్రత్యేకంగా ఈ నెల 28వ తేదీ నుంచి కోవిడ్ టీకా చేపట్టనున్న నేపథ్యంలో ఏర్పాట్లను ఉప సభాపతి తీగుళ్ల పద్మారావు గౌడ్ గురవారం సమీక్షించారు. ప్రభుత్వం సూపర్ స్పైడర్  లుగా గుర్తించిన వివిధ  రంగాలకు చెందిన వారికీ శుక్రవారం నుంచి ఉచితంగా టీకాలు పంపిణీ చేయనుంది. సికింద్రాబాద్ నియోజకవర్గానికి చెందిన 15 వేల మందికి 10 రోజుల పాటు సితఫలమండీ ఫంక్షన్ హాల్ సమీపంలోని క్యాంపు కార్యాలయంలో  ఈ టీకాలు అందించనున్నారు. వాక్సిన్ పంపిణీ కి 10 గదులు, 2 హాల్స్ ను   ఏర్పాటు చేశారు. ప్రజలు సామజిక దురాన్ని పాటిస్తూ, మాస్కులు ధరించి  టీకా కార్యక్రమంలో పాల్గొనాలని    ఉప సభాపతి తీగుల్ల పద్మారావు గౌడ్ ఈ సందర్భంగా తెలిపారు. శుక్రవారం నుంచి ప్రారంభించే  ప్రత్యెక శిబిరానికి అర్హులైన వారికీ టోకెన్లు పంపిణీ   చేశామని ఉప కమీషనర్  మోహన్ రెడ్డి ఈ సందర్భంగా పేర్కొన్నారు. కార్యక్రమంలో ప్రధాన   రేషనింగ్ అధికారి శ్రీమతి బాల మాయాదేవి,    బల్దియా ఉప కమిషనర్ మోహన్ రెడ్డి, మెడికల్ ఆఫీసర్ రవీందర్ గౌడ్,   అధికారులు బలరాం, గీతా తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published.