సినీకార్మికులకి నిత్యావసర వస్తువులను అందించిన సోహైల్..!!

సినీకార్మికులకి నిత్యావసర వస్తువులను అందించిన సోహైల్..!!

సీరియల్ నటుడిగా ప్రేక్షకులలో మంచి గుర్తింపు దక్కించుకుని ఆ తరువాత బిగ్ బాస్ షో ద్వారా మంచి క్రేజ్ అందుకున్న పాపులర్ నటుడు సోహైల్. యాంగ్రీ మ్యాన్ గా బిగ్ బాస్ హౌజ్ లో అయన చూపించిన ఆటతీరు కు లక్షలాది మంది ఆయనకు ఫ్యాన్స్ అయిపోయారు. ఇప్పటికీ ఆయనను సోషల్ మీడియా లో ఫాలో అవుతూ అయన అభిమానులు సోహైల్ చేసే ప్రతి పోస్ట్ ను లైక్, కామెంట్స్ చేస్తూ ఉంటారు.. బిగ్ బాస్ లో టాప్ 3 లో ఒకరిగా ఉన్న సోహైల్ మెగా స్టార్ చిరంజీవి ప్రశంశలు పొందారు.. ఇక బిగ్ బాస్ నుంచి బయటకి వచ్చిన తరువాత ఎన్నో సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ టాక్ అఫ్ ది టౌన్ గా మారుతున్నారు..

సోహైల్ హెల్పింగ్ హ్యాండ్స్ అనే సంస్థ ద్వారా ఆయన ఇప్పటివరకు చాలామందికి సహాయం చేయగా ప్రస్తుతం లాక్ డౌన్ లో ఇబ్బంది పడుతున్న సినీ కార్మికులకు తనవంతు సాయంగా నిత్యావసర వస్తువులను సరఫరా చేశారు. అంతేకాకుండా మరిన్ని సేవ కార్యక్రమాలు చేసేవిధంగా ప్రయత్నిస్తామని అయన భరోసా ఇచ్చారు.. ఇది తానొక్కడి శ్రమ మాత్రమే కాదని, కొంతమంది ఫ్యాన్స్ కలిసి సోహిలియన్స్ గా ఫామ్ అయ్యి ఈ కార్యక్రమాన్ని ముందుకు నడిపిస్తున్నారు.

ఈ సంస్థ ద్వారా సోహైల్ ఇప్పటికే 24 లక్షలకు పైగా ఖర్చుతో వైద్య సేవలు అందించామని వెల్లడించారు. గుండెసంబంధిత వ్యాధులతో, బ్రెయిన్ ట్యూమర్ వంటి ప్రాణాంతక వ్యాధులతో బాధపడుతున్న వారిని ఆదుకున్నామని అయన వెల్లడించారు. భవిష్యత్ లో కూడా ఇలానే చేస్తాం.. దానికి మీ ఆశీర్వాదాలు కావాలి. అన్నారు.. ఈ సంస్థ ఇంత బాగా పనిచేయడానికి, ముందుకు వెళ్ళడానికి సోహిలియన్స్ ఎంతో కష్టపడుతున్నారని అన్నారు..

Leave a Reply

Your email address will not be published.