కళ్యాణ లక్ష్మి, శాదిముబారాక్ చెక్కులను లబ్ధిదారులకు అందజేసిన  ఉప సభాపతి పద్మారావు గౌడ్

కళ్యాణ లక్ష్మి, శాదిముబారాక్ చెక్కులను లబ్ధిదారులకు అందజేసిన  ఉప సభాపతి పద్మారావు గౌడ్

ఆర్.బి.ఎం సికింద్రాబాద్: ఉపసభాపతి  తీగుల్ల పద్మారావు గౌడ్  ముషీరాబాద్, మారేడుపల్లి రెవిన్యూ మండలాల పరిధిలో  సితాఫలమండీ, బౌద్దనగర్, అడ్డగుట్ట, మెట్టుగూడ, తార్నాక డివిజన్లకు సంబంధించిన కోటి రూపాయలకు పైగా  విలువ చేసే 50 కళ్యాణ లక్ష్మి, శాదిముబారాక్,   82  CMRF చెక్కులను నామాలగుండు లోని క్యాంపు కార్యాలయంలో  27.10.2021  నాడు అందచేశారు.

ఆడపిల్లల పెళ్ళిళ్ళు తల్లి దండ్రులకు  భారంగా  మారకుండా ఏర్పాట్లు జరిపి, షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి పధకాలను ప్రవేశ పెట్టిన ఘనత గౌరవ ముఖ్యమంత్రి కెసిఆర్కే దక్కిందని ఉప సభాపతి తీగుల్ల పద్మారావు గౌడ్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. నిరుపేద ప్రజల సంక్షేమానికి వివిధ సంక్షేమ పధకాలను అమలు జరుపుతోందని ఉపసభాపతి తీగుల్ల పద్మారావు గౌడ్ అన్నారు.

షాది ముబరాక్, కళ్యాణ లక్ష్మి, పెన్షన్ పధకాల లబ్దిదారులు ఎవ్వరికీ చిల్లి గవ్వ కూడా చెల్లించాల్సిన అవసరం లేదని, ఎవరైనా డబ్బులు అడిగితే తమ కార్యాలయం నెంబరు 040-27504448 కు ఫిర్యాదు చేయవచ్చునని ఉప సభాపతి తీగుల్ల పద్మారావు గౌడ్ ఈ సందర్భంగా సూచించారు. తాసిల్దార్లు జానకి, సునీల్ కుమార్, తెరాస యువ నేతలు కిషోర్ కుమార్ గౌడ్ , తీగుల్ల రామేశ్వర్ గౌడ్, నాయకులు, అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *